హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారో మీకు తెలుసా? వెనక ఇంత పెద్ద కథ ఉందా.?

హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారో మీకు తెలుసా? వెనక ఇంత పెద్ద కథ ఉందా.?

by Megha Varna

Ads

హిందువులు రకరకాల దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అలానే వారంలో రోజుకొక దేవుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామికి భక్తులు వడమాలలు కూడా వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి వడమాల వేయడం చూశారా..? మీకు కూడా సందేహం కలిగిందా..? ఎందుకు వడమాల వేస్తారు అని… అయితే వడమాల వెనుక ఉండే కారణం గురించి ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఒక రోజు ఆంజనేయ స్వామి కొండ అనుకుని సూర్యుని మింగేస్తారు. దీంతో గ్రహణం వస్తుంది. రాహువు అప్పుడు ఎవరు ఈ పని చేశారు అని ఆరా తీయగా.. హనుమంతుడు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇలా నువ్వు చేశావు కనుక ఇక నుంచి నిన్ను పూజించిన వాళ్ళకి రాహువు దోషాలు తొలగి పోతాయని వరమిస్తాడు. అయితే రాహువుకి మినుము అంటే చాలా ఇష్టం.

గారెలు, వడలని కూడా మినుము తో చేస్తారు. కనుక వడలుగా హనుమంతుడికి వేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. రాహువు బాధలు, రాహువు దోషాలు తొలగిపోవాలంటే హనుమంతుడికి పూజ చేసి ఆ ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా వడలు గుండ్రంగా ఉంటాయి అలా సూర్య కిరణాలు రేఖ మాత్రం చేయడం కోసం ఉపయోగ పడతాయని పెద్దలు అంటారు.

అందుకే ఎక్కువగా మినుముతో చేసిన గారెలు, వడలు దండలుగా కట్టి ఆంజనేయ స్వామికి వేసి భక్తులు పూజిస్తారు. దీంతో అంతా మంచే కలుగుతుందని ఆంజనేయ స్వామి కోరిన కోర్కెలు తీర్చుతారని అంటారు. రాహువు దోషాలు, బాధలు తొలగి పోతాయని ఈ విధంగా అనుసరించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే జాంగ్రీలు కూడా ఆంజనేయ స్వామికి మినుముతో చేసి వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా వడలని మనం వేస్తాము.


End of Article

You may also like