నడిచేటప్పుడు మన చేతుల్ని ముందుకి వెనక్కి ఎందుకు కదుపుతుంటామో తెలుసా..? అసలు కారణం ఇదే..!

నడిచేటప్పుడు మన చేతుల్ని ముందుకి వెనక్కి ఎందుకు కదుపుతుంటామో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

సాధారణంగా మనం నడిచేటప్పుడు కానీ ఎవరైనా నడిపేటప్పుడు కానీ గమనించినట్లయితే నడుస్తున్నప్పుడు రెండు చేతులు కూడా ముందుకి వెనక్కి ఆడిస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైనా ఎందుకు ఇలా నడిచేటప్పుడు చేతులు కదుపుదాం అనేది ఆలోచించారా..? అయితే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. సాధారణంగా జీవపరిణామక్రమం ప్రకారం మనుషులుకి దగ్గర జాతి కోతులు. ఇవి నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి. కొంత వెనుక కాళ్ళ పై నుంచున్నా కూడా నడిచేటప్పుడు నాలుగు కాళ్ళని ఉపయోగిస్తాయి. అయితే మనిషి జీన్స్ లో ఇది ఇన్ వాలంటరీగా ఉండిపోయి ఉంటుందని చాలా మంది చెప్తున్నారు.

Video Advertisement

ఇదిలా ఉంటే సైంటిస్ట్లు ఒక ప్రయోగం చేయడం జరిగింది. దానిలో మూడు రకాలుగా మనిషి నడిస్తే ఎందులో ఎక్కువ శక్తి వినియోగించాల్సి ఉంటుందో తెలుసుకున్నారు. మామూలుగా చేతులూపుతూ నడవడం ఒకటి. చేతులని అసలు కదపకుండా నడవడం ఒకటి. ఎడం కాలు కదిపినప్పుడు ఎడం చేయి, కుడి కాలు కదిపినప్పుడు కుడి చేయి కదపడం ఇలా మూడు రకాలుగా గమనించడం జరిగింది.

అస్సలు చేతులని కదపకుండా నడవడం వల్ల ఏమయిందంటే… చేతులు మామూలుగా ఊపుతూ నడిచినప్పటి కంటే 12 శాతం ఎక్కువ శక్తి ఖర్చు అయింది. అదే ఎడం కాలు కదిపినప్పుడు ఎడమ చేయి, కుడి కాలుకి కుడి చెయ్యి కదిపినప్పుడు సాధారణంగా చేతులు ఆడిస్తూ నడిచే దాని కంటే 26 శాతం ఎక్కువ శక్తి ఖర్చు అయ్యిందని తెలుస్తోంది.

అలానే మరొక జవాబు కూడా దొరికింది. అదేమిటంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు రెండు చేతులు మనం ఊపుతూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం. ఆ చేతులతో నీటిని వెనక్కి నెటుతూంటాం. దీంతో నీరు ఆ ప్రదేశంలో డిస్ప్లేస్ అవుతుంది. అదే విధంగా గాలి కొంత రెసిస్టెన్స్ ను కలిగిస్తుంది కదా దానిని ఎంతో కొంత ఇలా చేతులు కదపడం ద్వారా తగ్గిస్తుంది. దీంతో శక్తిని మితంగా ఉపయోగించినట్లు కూడా అవుతుంది.


End of Article

You may also like