సర్జరీకి ముందు వైద్యులు ఆహరం తీసుకోవద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ లో ఏదైనా సాధించగలం. అయితే మనకు ఏదైనా సమస్య వచ్చి అనారోగ్యం బారిన పడి ఆపరేషన్ వరకు వెళుతుంది. ఆ సమయంలో వైద్యులు ఏది చెబితే దాన్ని మనం గుడ్డిగా ఫాలో అవుతాం. పని ఎందుకు చెప్పారో అందులో ఏం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పటి వరకు ఎంతమంది చేశారు.. ఎవరు చేయలేరు కదా..

అయితే ఆపరేషన్ చేసే ముందు వైద్యులు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అని చెబుతూ ఉంటారు. మరి ఎందుకు తినకూడదో, కారణమేంటో చూద్దాం..?

surgery 1

సాధారణంగా ఆపరేషన్ చేయడానికి ముందు మత్తు ఇంజక్షన్ ఇస్తారు. మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బొడ్డు కింద జరిగేటటువంటి ఆపరేషన్లకు నడుము భాగంలో మత్తు ఇస్తారు. దీన్నే స్పైనల్ అనస్తీసియా అని అంటారు. ఇక బొడ్డు పైన భాగానికి ఆపరేషన్ కోసం సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు. దీన్ని జనరల్ అనస్తీషియా అని అంటారు. ఇక మూడోది చేతికి లేదా కాలికి ఆపరేషన్ చేస్తే ఎక్కడ చేయాలో అక్కడే ఇస్తారు. దీన్నే వైద్యపరిభాషలో లోకల్ అనస్తీషియా అంటారు. అయితే ఈ సమయంలో ఆరు నుంచి ఎనిమిది గంటల ముందు ఏమి తినకూడదు అని చెబుతారు.

surgery 2

సాధారణంగా వెన్నెముకకు ఇచ్చేటువంటి మత్తు వల్ల తాత్కాలికంగా పేగులు పెరాలసిస్ కు గురవుతాయి. స్వతహాగా కదిలి, ప్రేగుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని కిందకి పంపే ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకుంటే అది కడుపు లోనే ఉండి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడుతుంది. ఇంకొకటి మనకు పూర్తి మత్తు ఇచ్చినప్పుడు కడుపు లో ఉన్నటువంటి ఆహారం మందుల ప్రభావం వల్ల గొంతులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివలన వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ఆహారం తినకుండా ఖాళీ కడుపుతో ఉండాలని డాక్టర్లు సూచిస్తారు.