రాత్రి చెట్లు కింద ఎందుకు నిద్రపోకూడదు..? కారణం ఇదే..!

రాత్రి చెట్లు కింద ఎందుకు నిద్రపోకూడదు..? కారణం ఇదే..!

by Megha Varna

Ads

చెట్ల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. నిజానికి చెట్లు లేక పోతే మన జీవితం ఉండదు. భూమిపై చెట్లు లేకపోతే జీవితం ఏముంటుంది..? మనుషులకు మాత్రమే కాకుండా చెట్లు పక్షులకి, జంతువులకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని రకాల జంతువులు చెట్ల ఆకులను కోసుకుని తింటూ ఉంటాయి.

Video Advertisement

పక్షులయితే చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. వాతావరణం కాలుష్యం అవకుండా కూడా చెట్లు చూసుకుంటాయి. ఇలా మనల్ని చెట్లు రక్షిస్తాయి.

పైగా ఎండలో అయినా వానలో అయినా చెట్లు మనకి నీడనిస్తాయి. ఇలా చెప్పుకుపోతే చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నరికిన చెట్లుని మనం ఫర్నిచర్ మొదలు ఎన్నో వాటికి ఉపయోగిస్తూ ఉంటాము. కొన్ని రకాల చెట్ల ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేప వంటివి అయితే ఆకులతో పాటు కొమ్మలు, బెరడు అన్నీ కూడా ఉపయోగపడతాయి.

ఇక ఇదిలా ఉంటే మన పెద్దలు చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటారు. కానీ మనం అన్నిటినీ పట్టించుకోము. కొన్నింటిని లైట్ తీసుకుంటూ ఉంటాము. మీ పెద్దలు కూడా చెప్పే ఉంటారు. రాత్రిపూట చెట్ల కింద నిద్ర పోకూడదని.. దెయ్యాలు భూతాలు మనం రాత్రి చెట్ల కింద ఉంటే తినేస్తాయని కాదు.

నిజానికి ఇలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకండి. రాత్రి సమయంలో చెట్ల కింద నిద్రపోకూడదని చెప్పడం వెనుక ఒక అర్థం ఉంది. చాలా చెట్లు కార్బన్ డయాక్సయిడ్ విడిచి పెడుతూ ఉంటాయి. రాత్రిపూట చాలా చెట్లు కార్బన్ డయాక్సయిడ్ విడిచి ఆక్సిజన్ గ్రహిస్తాయి. ఇందుమూలంగా మనము చెట్ల కింద నిద్రపోకూడదు. దీని వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. చెట్లు శ్వాస తీసుకునేందుకు ఆకులకి ఉండే సూక్ష్మ రంధ్రాలను ఉపయోగిస్తూ ఉంటాయి. దాన్నే స్టోమెటా అని కూడా అంటారని మనకి తెలిసిందే.


End of Article

You may also like