వేసవి కాలం లో సెలవులు ఇవ్వడంతో చాలా మంది వారికి నచ్చినటువంటి ఆటలను ఆడుకోవడానికి మరియు ఇతర యాక్టివిటీలు చేయడానికి ఇష్ట పడతారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్ద వారికి సమయం దొరికినప్పుడు క్రికెట్ వంటి ఆటలను ఆడడానికి ఇష్టపడతారు. చాలా శాతం మందికి ఇష్టమైన క్రీడలలో క్రికెట్ ఒకటి.
ముఖ్యంగా చిన్న వయసులో చాలా సమయాన్ని క్రికెట్ ఆడడానికి కేటాయించుతారు. పైగా ఆ వయసు లోనే సమయం దొరుకుతుంది. అయితే చిన్నతనం లో ప్రొఫెషనల్ గా కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఆడుకుంటారు.
పైగా వారికి నచ్చినటు వంటి రూల్స్ ను కూడా పెట్టుకుంటారు. ముఖ్యంగా క్రికెట్ ఆడడానికి ఉపయోగించే బాల్ కూడా రేడియమ్ రంగులో సాధారణంగా ఉంటుంది. నిజానికి అది ప్రొఫెషనల్ గా ఉపయోగించే క్రికెట్ బాల్ కాదు, కానీ సహజంగా ఎక్కువ మంది ఆ బాల్ నే ఉపయోగిస్తారు.
ఈ రేడియం రంగు లో ఉండేటు వంటి బాల్ పై గీతలు కూడా ఉంటాయి. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? నిజానికి వాటిని గమనించినా సరే అవి ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించి ఉండరు. మరి ఆ గీతలు ఎందు వలన ఉంటాయో ఇప్పుడే తెలుసుకోండి.
ఈ క్రికెట్ బాల్ ను రెండు రబ్బర్ కప్పులును ఉపయోగించి తయారు చేస్తారు. ఎప్పుడైతే ఈ రెండు కప్పులను బాల్ కింద అమర్చుతారో అప్పుడు గీతలు ఏర్పడతాయి. నిజానికి ఇవి ఒక డిజైన్ లా ఉన్నా సరే గ్రిప్ ఎక్కువగా ఉండడానికి సాయం చేస్తాయి. అంతే కాకుండా స్పిన్ చేయడానికి ఎంతో వీలుగా ఉంటాయి. ఒకవేళ ఈ గీతలు లేకుండా బాల్ ను రూపొందిస్తే ఎక్కువ కాలం బాల్ మన్నదు అని గమనించాలి. అంతే కానీ ఏదో లుక్ కోసం వీటిని పెట్టరు.