మీ పార్టనర్ తో పదే పదే గొడవలు వస్తున్నాయా…? ఇంట్లో ఈ వాస్తు దోషాలని సరిచేసుకోండి..

మీ పార్టనర్ తో పదే పదే గొడవలు వస్తున్నాయా…? ఇంట్లో ఈ వాస్తు దోషాలని సరిచేసుకోండి..

by Megha Varna

Ads

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే అలాంటి సమయంలో ఇద్దరూ సర్దుకుపోతే అక్కడితో గొడవ ఆగిపోతుంది. లేదంటే గొడవల వల్ల మనశ్శాంతి కూడా ఉండదు. అయితే కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చీటికీమాటికీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి బంధం లో అన్యోన్యత కూడా ఉండదు.

Video Advertisement

అలా మీరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని ఫాలో అవ్వండి. వీటిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఏర్పడతాయి. అలానే అన్యోన్యత వస్తుంది. అయితే మరి ఇక ఆ వాస్తు చిట్కాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

  1. భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడాలంటే బెడ్రూంలో కిటికీ ఉండాలి. కిటికీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కనుక బెడ్ రూమ్ లో తప్పక కిటికీ ఉండేటట్లు చూసుకోండి. దీంతో ప్రేమానురాగాలు వస్తాయి.
  2. అలానే బెడ్ రూమ్ లో ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ సామాన్లను పెట్టుకోకూడదు. ఎలక్ట్రానిక్ సామాన్లు పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడతాయి.
  3. అదే విధంగా బెడ్ రూమ్ లో పింక్ కలర్, గ్రీన్ కలర్ కానీ పెయింట్ వేస్తే మంచిది. దీని వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.


4. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. అయితే ఇంట్లో మొక్కలు పెట్టేటప్పుడు ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోండి. ముళ్ళ మొక్కల వల్ల ఇబ్బందులు వస్తాయి.
5. బెడ్ రూమ్ లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచి కలుగుతుంది.
6. బెడ్ రూమ్ లో ఎప్పుడు కూడా దేవ దేవతల ఫోటోలు పెట్టకూడదు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.


End of Article

You may also like