Ads
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న యశోద మూవీకి దర్శకులు ద్వయం హరి శంకర్ & హరీష్ దర్శకత్వం వహించారు. సినీ నటి సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. సమంత యొక్క యశోద ఆమె కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో ప్రెగ్నంట్ గా సమంత నటన అందరి ఆకట్టుకుంటుంది.
Video Advertisement
సమంత గర్భవతి అని డాక్టర్ తెలియజేసి, ఆమెకు చేయవలసినవి మరియు చేయకూడనివి చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అయితే, ఆమె గర్భిణిగా ప్రతి కట్టుబాటును ఉల్లంఘిస్తుంది మరియు దేనితోనో చాలా పెద్ద గా పోరాడుతుంది.
మీకు గుర్తుందా సేమ్ ఇదే కాన్సెప్ట్ తో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా కూడా ఒకప్పుడు రిలీజ్ అయింది. ట్రైలర్ గమనించినట్లయితే యశోద చిత్రం చాలా వరకు పెంగ్విన్ ని పోలి ఉండడం గమనించ వచ్చు. కథ పరంగా, కథనం పరంగా పెంగ్విన్ బాగున్నప్పటికీ కన్ఫ్యూజన్ సస్పెన్స్ వల్ల అది అనుకున్నంత గా సక్సెస్ కాలేక పోయింది. మరి ఈ క్రమంలో అదే నేపథ్యంలో రిలీజ్ అవుతున్న యశోద చిత్రానికి ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
స్టోరీలో కొంత మార్పు ఉన్నప్పటికీ హీరోయిన్ ప్రెగ్నెంట్ నేపథ్యంలో సినిమా సాగడం, ఆమె పోరాటం తదితర అంశాలు అన్ని ఎంతో కొంత పెంగ్విన్ సినిమాతో మ్యాచ్ అవుతున్నాయి. మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ మధ్య ఇలా వచ్చిన సినిమాలు అన్నీ కూడా కొన్ని హిట్ అయితే కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా లో అంత సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా పాన్ ఇండియన్ రిలీజ్ అవుతున్నాయి. ఫ్యామిలీ మాన్ తర్వాత సమంత బాలీవుడ్ లో కూడా చాలా పాపులర్ అయ్యారు.
ఇలాగే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యారు అని లైగర్ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని పొందలేదు. ఈ సినిమా అలా అవ్వకుండా ఉంటే బాగుండు అని చాలామంది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న యశోద చిత్రం పేలవమైన ఫలితాలను ఇస్తుందా లేదు రికార్డులు బద్దలు కొడుతుందా వేచి చూడాలి.
End of Article