భర్తకు అన్నం వడ్డిస్తున్న ఓ భార్య అందం చూసి ఆ రాజు మోహించాడు…చివరకి ఆ రాజుకి ఆమె ఎలా బుద్దిచెప్పిందంటే.?

భర్తకు అన్నం వడ్డిస్తున్న ఓ భార్య అందం చూసి ఆ రాజు మోహించాడు…చివరకి ఆ రాజుకి ఆమె ఎలా బుద్దిచెప్పిందంటే.?

by Anudeep

మన పురాణాల్లో భార్య భర్త ల బంధానికి విలువను ఇచ్చే కధలు అనేకం ఉన్నాయి. ఓ స్త్రీ వివాహిత అయిన తరువాత ఆమెను తల్లి లా గౌరవించాలని ఈ కధలు నీతిని బోధిస్తున్నాయి. ఒకసారి వివాహం అయిన స్త్రీ పై కామం, మోహం తగదు. ఇది మన భారతీయ వివాహ వ్యవస్థలోని సంప్రదాయం. అయితే, ప్రస్తుతం రోజులు చాలా మారి వావి వరుసలను మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఓ వివాహిత స్త్రీ ఎంత పునీతం గా ఉండాలో వివరించే కథ ఒకటి తెలుసుకుందాం.

Video Advertisement

MARRIAGE 2

ఓ రోజు.. ఒక రాజు వేటకు వెళ్లి మధ్యలో అలసి పోయాడు. ఆ అడవి దారికి దగ్గరిగా ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామం లో ఓ ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంట్లో ఓ స్త్రీ తన భర్త కు భోజనం వడ్డించడాన్ని చూసాడు. ఆమె చాలా అందం గా ఉంది. ఆమె అందాన్ని చూసి.. అంతటి రాజే స్థాణువైపోయాడు. ఆమె భర్త భోజనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తలుపులు మూసేసి లోపలకి వెళ్ళబోతున్న సమయం లో రాజు అక్కడకు వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టాడు.

king asked to marry

ఆమె తలుపు తీసి ఎవరు అని ప్రశ్నించగా.. ఆ రాజు లోపలకి వచ్చి కూర్చుని తనను తానూ పరిచయం చేసుకున్నాడు. తాను ఈ రాజ్యానికి రాజునని చెప్పి.. నీవు ఎంతో అందం గా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. దీనితో ఆమె ఆశ్చర్యపోయింది. తనకు మునుపే పెళ్లి అయినదని వారించింది. అయినా.. ఆ రాజు వినలేదు. దీనితో ఆమెకు పాలుపోలేదు. ఎదురు గా ఉన్నది మహారాజు. ఏమైనా తేడా వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం కలిగింది ఆమెకు. ఆమె ఎంతో గుణవంతురాలు..మరియు సంస్కారం కల అమ్మాయి.

MARRIAGE

వెంటనే, రాజా.. మీరు ముందు భోజనం చేయండి. చాలా దూరం నుంచి వచ్చి అలసి పోయి ఉంటారు అంటూ.. తన భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకు వైపు చూపించింది. అది చూసి మహారాజు కు కోపం వచ్చింది. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకులో నేను భోజనం చేయాలా అంటూ ఆగ్రహించాడు.

అప్పుడు ఆమె” రాజా.. శాంతించండి. నా భర్త భోజనం చేసిన ఆకులో భోజనం చేయడానికి అడ్డు వచ్చిన ఎంగిలి ఇది వరకే పెళ్లి అయి ఒకరి సొంతం అయిపోయినన్ను నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డు రాలేదా? అని ప్రశ్నించింది. దీనితో, రాజుకు విషయం బోధపడింది. వెంటనే, అక్కడనుంచి లేచి ఆమెకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పరాయి స్త్రీని ఎప్పుడు చెడు దృష్టితో చూడకూడదని మన పెద్దలు మనకు చెబుతూ వస్తున్నారు.


You may also like