అమ్మో మహిళా అఘోరాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా.. ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటారంటే..??

అమ్మో మహిళా అఘోరాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా.. ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటారంటే..??

by Sunku Sravan

Ads

అఘోరాలు అంటే మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కాశీ,ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిలో మాత్రం ఇటువంటి వారు కనిపించరు. మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ నిజంగానే అలాంటి మనుషులు ఉంటారు.ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తారు. అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం సినిమాల్లో కూడా పురుష అఘోరాలను మాత్రమే చూశాము. కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల లాగే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించడంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు.

Video Advertisement

మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు కనీసం ఆరేళ్లపాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. అలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న వారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించ గలరని సన్యాసి ఆచార్య మహా మండలేశ్వర్ నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తాడు. ఆడ అఘోరాలు తమ రక్తసంబంధీకులను వదిలేసుకోవాలి.

నాగ సాద్వి గా మారిన తర్వాత పురుషులతో సమానంగా శివపూజ లో పాల్గొనాలి. మహిళా నాగ సాద్వి లు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవి ఎక్కువగా పూజిస్తారు. పూజ చేసే సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని ఆ దైవాన్ని అఘోరాలు కోరుకుంటారు. కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో ఎవరు ప్రూవ్ చేసి బయట పెట్టింది లేదు. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగసాద్వి లుగా మారేందుకు కాశీ,వారణాసి వస్తుంటారు.


End of Article

You may also like