భార్య భర్తలన్నాక ఒకరిపట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఉండడం సహజం. చాలా మంది భారతీయ స్త్రీలు తమ భర్త తోనే జీవనం అన్న నైతిక భావాలను కలిగి ఉంటారు. అయితే.. పరిస్థితులు మాత్రం అందరికి ఒకేలా ఉండవు. ఓ అమ్మాయి.. తన భర్త ఎనిమిదేళ్లు గా దూరం గా ఉండడం వలన.. తన సహోద్యోగిని ఇష్టపడుతోంది. ఇప్పడు ఏమి చేయాలో అర్ధం కాక సలహా కోరుతోంది.

triangle love story

విషయం లోకి వెళితే, ఆ అమ్మాయి ఇలా చెప్పుకొచ్చింది. నా వయసు 36 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉద్యోగ రీత్యా నా భర్త దాదాపు ఎనిమిది సంవత్సరాలు గా విదేశాల్లోనే ఉంటున్నారు. దీనివలన స్వతహాగానే మా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. పిల్లలు కూడా ఆయనకు మానసికం గా దగ్గరకాలేకపోతున్నారు. దానికి తోడు.. ఆయన ఐదారు నెలలకు ఒకసారి ఇంటికి వస్తుంటారు.

triangle love story2

తండ్రికి అలవాటు కాకపోవడం తో పిల్లలు కూడా ఆయన వచ్చినపుడు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మరో వైపు నాకు కూడా ఆయన పట్ల ఇష్టం తగ్గిపోయినట్లు.. మా ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు అనిపిస్తోంది. ఇది ఇలా ఉంటె.. నాకు మా సహోద్యోగి తో సాన్నిహిత్యం ఏర్పడింది. నాకు భర్త ఉండి.. ఇలా మరొకరితో సన్నిహితం గా ఉండడానికి మనసొప్పడం లేదు. భర్త తో నాకు మానసిక బంధం లేనట్లే ఉంది. మా బంధాన్ని తిరిగి బలపరుచుకోవడానికి కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

triangle love story 3

మరో వైపు నేను ఇష్టపడ్డ వ్యక్తి కి కూడా ఇదివరకే పెళ్లయింది. మా ఇద్దరి విషయం నా భర్త కు తెలియదు. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు.. వైవాహిక బంధంతోనే ముందుకెళ్లాలా? లేక మనసుకు నచ్చిన వ్యక్తి తో కొత్త బంధం మొదలు పెట్టాలా..? అన్న విషయమై నాకు సలహా ఇవ్వగలరు.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE