పెళ్లయిన తర్వాత ప్రతి స్త్రీ కూడా మంగళసూత్రాన్ని ధరిస్తుంది. ఉదయం లేచిన తర్వాత మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని లేస్తూ ఉంటారు మహిళలు. కానీ చాలా మంది మంగళసూత్రం విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏమిటో తెలుసుకుంటే మీరు అటువంటి తప్పులుని చేయకుండా చూసుకోవచ్చు.

Video Advertisement

మహిళ జీవితం పెళ్లి తర్వాత ఎంతో మారుతుంది. చాలా రకాల మార్పులు ఆమె జీవితంలో వస్తాయి. ఆమె ఆలోచన విధానం మొదలు వస్త్రధారణ వరకు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి అనేది రెండు మనసులని దగ్గర చేయడమే కాదు రెండు కుటుంబాలని ఒకటి చేస్తుంది.

how lfe changes after marriage..

సుముహూర్తం సమయంలో వధూవరులు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఆ తర్వాత వధువు మెడ లో మంగళ సూత్రాన్ని వరుడు కడతాడు. వరుడు కట్టిన మంగళ సూత్రాన్ని ఆ స్త్రీ ఎప్పుడు తొలగించకుండా తన మెడలోనే ఉంచుకుంటుంది. పెళ్లిలో కట్టే మంగళసూత్రం ఎంతో పవిత్రమైనది. ఎప్పుడు కూడా మంగళ సూత్రానికి పిన్నులు వంటివి పెట్టకూడదు. చాలామంది మహిళలు సేఫ్టీ పిన్స్ వంటి వాటిని ఆ మంగళ సూత్రానికి తగిలిస్తూ ఉంటారు.

ఇలా చేయడం వలన తాళిబొట్టుకి ఉండే శక్తి దానికి వెళ్ళిపోతుంది. పైగా ఇది భర్త కి కష్టాలని కూడా తీసుకు వస్తుందట. ఈ అలవాటు మీకు కూడా ఉంటే మానుకోవడం మంచిది. అలానే తాళిబొట్టుని అసలు మహిళలు తీయకూడదు. తాళి బొట్టును తీసేస్తే భర్తకి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ప్రేమకి నమ్మకానికి గుర్తుగా మహిళ తన భర్త బతికి ఉన్నంత వరకు మంగళ సూత్రాన్ని ధరించాలి.

ఇదిలా ఉంటే మంగళ సూత్రానికి చాలా మంది పూసలు కట్టుకుంటారు. అయితే పూసలు కట్టుకోవడం వలన ఇబ్బంది ఏమీ రాదు. తాళిబొట్టుకి నల్లటి పూసలు, ఎర్రటి పూసలు కట్టడం వలన నరదిష్టి తగలకుండా ఉంటుంది. కనుక తాళిబొట్టుకి పూసలని కట్టుకోవచ్చు. తప్పు లేదు.