Home Off Beat అబ్బాయిల్లో మొదటగా అమ్మాయిలు చూసేది ఇదే అంట.?

అబ్బాయిల్లో మొదటగా అమ్మాయిలు చూసేది ఇదే అంట.?

by Megha Varna

నిజానికి స్త్రీని మెప్పించడం అంత సులభం కాదు. మీరు ఎంతగా ప్రేమించిన ఆమెకి నచ్చకపోవచ్చు. చాలా మంది మగవాళ్ళు ప్రేమించిన అమ్మాయి కూడా తిరిగి వాళ్ళని ప్రేమించాలి అని అనుకుంటూ ఉంటారు. దాని కోసం నిజంగా ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని ప్రేమ లోకి తీసుకెళ్లాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

image credits: a screenshot from Enai Saaithaale short film

నిజానికి సముద్రం లోతు అయినా తెలుసుకోవచ్చు. కానీ స్త్రీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే స్త్రీలకి నచ్చాలంటే మగవాళ్ళు ఎలా ఉండాలి..?, వారు ఏం చేస్తే స్త్రీలకు నచ్చుతారు అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం.

చాలా మంది అబ్బాయిలకు ఈ విషయం తెలియక రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆమెను మెప్పించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పైగా ఇంప్రెస్ చేయడానికి.. ఆమెకు నచ్చిన వాటిని చేయడం, మంచి మంచి డ్రస్సులు వేసుకోవడం, హెయిర్ స్టైల్స్ ని చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. అయితే నిజానికి స్త్రీలు మగవారిలో వీటిని చూస్తారని చాలా మంది మగ వారికి తెలియదు.

వాళ్లు మనల్ని ఏం చేస్తే లవ్ చేస్తారా అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. నిజానికి స్త్రీలు పురుషుల యొక్క మేధస్సుని కానీ జీవితంలో అతను సాధించిన విజయాలను కానీ చూడరు. అదే విధంగా వారి యొక్క పర్సనాలిటీ, అతనిలో గొప్పతనం ఏమిటి అనేది కూడా స్త్రీలు చూడరు.

ఇవేమీ కూడా స్త్రీని ఆకట్టుకోవు. కేవలం ఆమె అతడు ఆమెను గుర్తించాడా లేదా అనేది మాత్రమే చూస్తుంది. మీరు కనుక మీకు నచ్చిన అమ్మాయిని ఫిదా చేయాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి.

You may also like