మన ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉంటే ఇల్లు అంతా శుభ్రంగా ఉన్నట్లే. ఏ ఇల్లాలు అయితే ఇంటినంత పరిశుభ్రంగా ఉంచుకుంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆడవారు ఇంట్లో చేయకూడని పనులు ఉన్నాయి.. అవేంటో చూద్దామా..!!

Video Advertisement

మనం చేసే పనే మనల్ని కష్టాల్లో పడేస్తుంది. మన ఇంట్లో ఉండే పాలుగాని, పెరుగు కానీ, ఇతరులకు ఇస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అంటారు.

వంటింట్లో మనం వంట వండుతాం. వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వంట అంతా పూర్తయిన తర్వాత స్టవ్ మరియు ఇతర వస్తువులను శుభ్రం చేసుకోవాలి. అలా చేసిన తర్వాతే నిద్ర పోవాలి. లేదంటే లక్ష్మీదేవి అలుగుతుందట.

అలాగే ఇంట్లో మహిళలు వారి జుట్టును విరబోసుకుని తిరగకూడదు. జుట్టు విరబోసుకుని తిరగడం అనేది మనుషులు చేసే పని కాదు. రాక్షసులు చేసే పని. ఇలా రాక్షస పనులు చేసేవారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు.


అలాగే సాయంత్రం సమయంలో మన ఇంట్లో ఉండే ఉప్పును కానీ కుంకుమ కానీ ఇతరులకు అసలు ఇవ్వకూడదట. ఉప్పు కుంకుమ అనేవి లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు. కాబట్టి వీటిని సాయంత్రం సమయంలో ఎవరికి కూడా ఇవ్వకూడదు.
ఇలాంటి కొన్ని పద్ధతులను మనం పాటిస్తే ఇంట్లో అంతా సుఖంగా ఉంటారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.