Ads
చాలామంది అమ్మాయిలు ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా సడన్ గా ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా చాలామంది అమ్మాయిలు ఒంటరిగానే వెళ్తుంటారు.
Video Advertisement
అయితే అందరు అమ్మాయిలు ధైర్యంగా ఉండకపోవచ్చు. ట్రైన్ లో ఒంటరిగా వెళ్లే సమయంలో అనుకొని ఆపదలు చుట్టుముట్టవచ్చు… అలాంటి అమ్మాయిలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి…మీకు చాలా ఉపయోగపడుతుంది…
ఒంటరిగా ఆడపిల్లలు కనిపిస్తే పోకిరి వెధవలు ఎక్కడైనా సరే అదునుగా చూసుకుని ఏడిపిస్తూ ఉంటారు. అలాంటిది ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. మీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తారు. మీ సీట్లలో కూర్చుని లేవకుండా ఇబ్బందులకు గురిచేసిన లేదా మీతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఇకపైన మీరు భయపడాల్సిన పనిలేదు. మీకోసమే రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకువచ్చింది. ప్రతి ట్రైన్ బోగి లోను ఈ నెంబర్ ను అందుబాటులో ఉంచుతారు.
ఆ నంబరే 182. మీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైన ఈ నెంబర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్ లో మీకు సహాయం దొరుకుతుంది. ఈ నెంబరు డివిజనల్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ ఫర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా 24 గంటలు ఏడు రోజులు పనిచేస్తూనే ఉంటుంది. ఈ నెంబర్ మీ ఫోన్లలో సేవ్ చేసుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందికరమైన తక్షణ సహాయం అంది మీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే ఆడవాళ్లు, మహిళలు, అమ్మాయిలు దీన్ని మీ దృష్టిలో పెట్టుకోండి.
End of Article