పూర్వకాలంలో ఆడవాళ్ళు ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లతో, నిండైన తెలుగుదనం ఉట్టిపడేలా ఉండేవారు. పెరుగుతున్న టెక్నాలజీ, పాశ్చాత్య సంస్కృతి, ఫ్రీడం ఆడ మగ సమానమనే భావన ప్రస్తుతం అందరిలో కలుగుతోంది. ఆడవాళ్ళు కూడా మగవాళ్లతో సమానంగా పోటీ పడి ఏ ఉద్యోగమైనా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తున్నారు.

Video Advertisement

కొంతమంది చిలిపిగా అందం కోసం పెట్టుకుంటారు అని అంటారు కదు.. కాదండోయ్ ఇంకో ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందట.. మహిళలు పూలు పెట్టుకోవడం అనేది మన ఇండియాలోనే మొదలైంది. దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది. పూలు అందాన్ని ఇవ్వడమే కాకుండా సంతోషానికి అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. స్త్రీలు తన తలలో మల్లె పూలు పెట్టుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారని, ఆ ఇల్లు లక్ష్మీ దేవి నిలయం గా మారుతుందని నమ్ముతుంటారు.

తలలో పెట్టుకునేటువంటి ప్రతి ఒక్క పువ్వుకు ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంది. వీటిని దేవుని పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే మల్లెపూలను దేవుని పూజలో కూడా ఎక్కువగా వాడతారు. మల్లెపూలు నుంచి వచ్చే మంచి సువాసన ఆరోగ్యానికి మంచిదట. అలాగే చిన్న పిల్లల తల్లులు ఈ పూలను పెట్టుకుంటే తన బిడ్డకు ఎక్కువ రోజులు పాలు ఇస్తారని పెద్దలు చెబుతుంటారు.