Ads
ఇది వరకు రోజులు పోయాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ ఏ అందరిని నడిపిస్తోంది. ప్రతి ఒక్కరికి లాప్టాప్ చాలా అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగులకి లాప్టాప్ లేకపోతే పనే జరగదు. ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్లను ఉపయోగిస్తున్నారు.
Video Advertisement
స్టూడెంట్లు కూడా ఆన్లైన్ క్లాసులు వంటి వాటి కోసం ఉపయోగిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్ల ముందు నుండి కదలడం లేదు.
ఆఫీసులో అయితే కచ్చితంగా టేబుల్ మీద లాప్టాప్ ని పెట్టే పని చేయాల్సి వస్తుంది కానీ ఇంట్లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు వర్క్ చేసుకోవచ్చు అని ధీమాతో పడుకుని కూడా కొందరు వర్క్ చేస్తున్నారు. చాలామంది లాప్టాప్లను ఉపయోగించేటప్పుడు బోర్లా పడుకుని ఉపయోగిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా..? అయితే ఈ సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి.
బోర్లా పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు:
#1. మెడ నొప్పి సమస్య:
గంటల తరబడి పడుకుని లాప్టాప్ ముందు సమయం గడిపితే మెడనొప్పి వస్తుంది. ఒకే పొజిషన్లో ఇలా చూడడం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#2. వెన్ను నొప్పి సమస్య:
మెడ నొప్పితో పాటుగా వెన్నునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బోర్లా పడుకుని ల్యాప్టాప్లను చూసే అలవాటు ఉంటే మానుకోండి.
#3. స్పైనల్ కార్డ్ పై ఎఫెక్ట్:
బోర్లా పడుకుని లాప్టాప్స్ ముందు గంటల కొద్ది సమయాన్ని గడపడం వల్ల స్పైనల్ కార్డ్ కి సంబంధించి సమస్యలు రావచ్చు.
#4. ఎముకల నొప్పి:
బోర్లా పడుకుని లాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వెన్ను కండరాలు సాగిపోతాయి దీనితో ఎముకల నొప్పి కూడా రావచ్చు.
#5. జీర్ణక్రియ దెబ్బతింటుంది:
పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది.
End of Article