Ads
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160, ఐజాక్ న్యూటన్ ఐక్యూ 190, మార్క్ జూకర్బర్గ్ ఐక్యూ 152. వీళ్ళందర్నీ ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా పిలుస్తారు. కానీ వీళ్ళు అందరూ కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆయన ఐక్యూ ఏకంగా 250 నుండి 300 ల మధ్యలో ఉంటుందని అంచనా. అతనే విలియం జేమ్స్ సిడిస్. విలియం ఒక మాథెమటిషన్, ఇంకా రచయిత. విలియం ఎన్నో భాషలు మాట్లాడగలరు. కానీ ఇంత మేధావికి తగిన గుర్తింపు రాకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం.
Video Advertisement
విలియం 1898 లో న్యూయార్క్ నగరంలో జన్మించాడు. అతని తండ్రి బోరిస్ ఒక సైకాలజిస్ట్, అతను హార్వర్డ్ నుండి 4 డిగ్రీలు సంపాదించాడు. అతని తల్లి కూడా ఎండి. అతని తల్లిదండ్రులు మేధావులు కాబట్టి, విలియం జేమ్స్ సిడిస్ కూడా తెలివిఅయినవాడు అయ్యుండొచ్చు అని అనుకున్నారు. కానీ మామూలు కంటే ఎంతో ఎక్కువ ఐక్యూ ఉండడంతో అతను సాధారణమైన వ్యక్తి కాదు అని తేలింది.
కేవలం 18 నెలల వయసులో, అతను ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ చదివేవాడు. 8 సంవత్సరాల వయస్సులో, అతను లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, హిబ్రూ, టర్కిష్ మరియు అర్మేనియన్ భాషలను తను సొంతంగా నేర్చుకున్నాడు. ఆ 8 భాషలతో పాటు, అతను సొంతంగా ఒక భాష ని కూడా కనుగొన్నాడు దానికి “వెండర్గూడ్” అని పేరు పెట్టాడు.అతని తెలివితేటల గురించి తెలుసుకున్న అతని తండ్రి విలియం ని హార్వర్డ్‌లో చేర్పించడానికి ప్రయత్నించాడు, కాని ఆ సమయంలో విలియమ్‌కు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే కావడంతో యూనివర్సిటీ వాళ్లు చేర్చుకోవడానికి నిరాకరించారు. 2 సంవత్సరాల తరువాత 1909 లో, ఇన్స్టిట్యూట్ అతన్ని అంగీకరించింది. విలియం హార్వర్డ్‌లో చేరిన అతి పిన్న వయస్కుడు. 1910 నాటికి, అతని గణితశాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగింది, దాంతో అతను తన ప్రొఫెసర్లకు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు, “చైల్డ్ ప్రాడిజీ” అనే బిరుదు సంపాదించాడు. అతను తన 16 సంవత్సరాల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
కానీ ఇలా కీర్తి ప్రతిష్టలు సాధించడం కూడా కొంత వరకే బాగుంటుంది. ఎక్కువ అయితే ఇది కూడా ప్రమాదకరమే. ఇలా అనవసరమైన పాపులారిటీ గురించి విలియం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నప్పటి నుంచి తను గురైన ఒత్తిడి గురించి చెప్పాడు. అమెరికాలో పిల్లలందరినీ ఎంతో తెలివిగల వాళ్లని చేస్తే విద్యా వ్యవస్థ బాగు పడుతుంది అని నమ్మేవాళ్ళు అని, దాంతో చిన్నప్పటినుంచి పిల్లల అందరి మీద ఒత్తిడి చేసి చదివించే వాళ్లు అని, కానీ తన తండ్రి సైకాలజిస్ట్ అవ్వడంతో విలియం స్టార్ అవ్వాలని తన తండ్రి కలలు కన్నాడు.
తాను చదువుకున్నదంతా ఉపయోగించి విలియం కు విద్య నేర్పించాడు. చిన్నప్పుడు విలియం తన తండ్రి వాడి టెక్నిక్లను చూసి ఆనందించిన, పెద్ద అయిన తర్వాత తను అలా అనవసరమైన పేరుతో ఇబ్బంది పడటానికి కారణం తన తండ్రి అని చెప్పాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనను చివరి చూపు చూడడానికి కూడా విలియం వెళ్లలేదు.ఎంతో పెద్ద మేధావులు అందరూ జనాల మధ్య లో ఉండటానికి ఇష్టపడరు. అదే బాటలో విలియం కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. 1924లో ఒక మీడియా వాళ్లు విలియం ని గుర్తించారు. అప్పుడు విలియం నెలకి $23 సంపాదించే ఉద్యోగం చేసేవాడు. అది చూసిన ఆ రిపోర్టర్ మేధావి అని పేరు పొందిన తను ఇప్పుడు ఇలాంటి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.
తాను చిన్నప్పుడు ఉన్నంత తెలివి ఎప్పుడూ అతనికి లేదు అని వెటకారంగా మాట్లాడారు. అయినప్పటికీ విలియం అవేమీ పట్టించుకోకుండా వేర్వేరు పేర్లతో ఎన్నో పుస్తకాలు రాశాడు.విలియం ఒక సోషలిస్ట్. 1919 సంవత్సరం లో బోస్టన్ లో చేసిన ఒక నిరసనలో విలియం అరెస్ట్ చేయబడ్డాడు. 18 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత విలియం తల్లిదండ్రులు అతని తీసుకెళ్ళి వాళ్ల శానిటోరియంలో రెండేళ్లు పెట్టారు. తనకి 46 ఏళ్ల వయసున్నప్పుడు సెరిబ్రల్ హెమోర్హ్యాజ్ తో విలియం చనిపోయాడు. ఇంకో విషయం ఏంటి అంటే విలియం తల్లి కూడా అదే వ్యాధితో చనిపోయాడు.
End of Article