దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న  విడుదల అయ్యింది. అయితే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

Video Advertisement

ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కొంతమంది హీరో అఖిల్ పై, మరికొంత మంది సురేందర్ రెడ్డి పై తీవ్రంగా  విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను సమకూర్చిన రచయిత వక్కంతం వంశీ పై నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించగా, మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించారు. ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని చాలా కష్టపడ్డాడు. పూర్తిగా తన లుక్ నే మార్చుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తోంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. హీరో, డైరెక్టర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చేతకాకే ఇటువంటి చిత్రాన్ని తీశారంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు హీరో అఖిల్ నటన పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి కథను అందించిన రైటర్ వక్కంతం వంశీని నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ స్టోరీ కోసం వంశీ భారీగా రెమ్యునరేషన్ తీసుకునట్లు వార్తలు రావడమే.
వక్కంతం వంశీ గతంలో కిక్, ఉసరవెల్లి, ఎవరు, రేసుగుర్రం వంటి పలు హిట్ సినిమాలకు కథలు సమకూర్చారు. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఏజెంట్ సినిమా స్టోరి కోసం వక్కంతం వంశీ 2 కోట్ల రెమ్యునరేషన్   తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో వక్కంతం వంశీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Also Read: అఖిల్ అక్కినేని “ఏజెంట్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?