ఈ 3 రాజమౌళి సినిమాల్లో కామన్ గా ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

ఈ 3 రాజమౌళి సినిమాల్లో కామన్ గా ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

by Mohana Priya

Ads

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతో మంది నటులు ఇప్పుడు హీరో, హీరోయిన్లు గా లేదా ముఖ్య పాత్రలలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఓ బేబీ సినిమా తో తేజ కూడా ఆ జాబితాలో చేరాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ కూడా హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు అని ప్రకటించారు. వీళ్లే కాకుండా ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఇటీవల హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.

Video Advertisement

యమదొంగ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో నటించిన అబ్బాయి మీకు గుర్తు ఉన్నాడా? అతని పేరు శ్రీ సింహ. శ్రీ సింహా మరెవరో కాదు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి గారి కొడుకు.

Also Read: అదే హీరో…అదే డైరెక్టర్…! హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన 5 హీరో – డైరెక్టర్ కాంబినేషన్స్.!

యమదొంగ తర్వాత మర్యాద రామన్న సినిమా లో కూడా రాయలసీమలో హీరో సునీల్ కి దారి చూపించే ఓబులేసు క్యారెక్టర్ పోషించాడు  శ్రీ సింహ. యమదొంగ ముందు వచ్చిన విక్రమార్కుడు సినిమా లో కూడా హీరో హీరోయిన్ కోసం వెళ్లిన ఇంట్లో కనిపించే పిల్లల్లో ఒక అబ్బాయి గా చేశాడు.

ఆ తర్వాత మత్తు వదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది చివర్లో విడుదలైన మత్తు వదలరా సినిమా ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సినిమాలో నటించిన శ్రీ సింహ పర్ఫామెన్స్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి.

శ్రీ సింహ కి నటనలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్లలో కూడా ప్రావీణ్యం ఉంది.

బాహుబలి సినిమా కి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. అంతేకాకుండా 2018 లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం రంగస్థలం సినిమా కి దర్శకుడు సుకుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.

Also Read: “ఇయర్ క్లీనింగ్” పేరుతో రోడ్ల మీద కొందరు చేసే ఈ మోసం గురించి తెలుసా.?

శ్రీ సింహ సోదరుడు కాలభైరవ కూడా సినిమాల లోనే ఉన్నాడు. తొలిప్రేమ, అరవింద సమేత వీర రాఘవ, డియర్ కామ్రేడ్, కిరాక్ పార్టీ, మజిలీ, బాహుబలి ద కంక్లూషన్, మిస్టర్ మజ్ను, కృష్ణార్జున యుద్ధం ఇంకా ఎన్నో సినిమాల్లో పాటలు పాడాడు.

అంతేకాకుండా తన సోదరుడు శ్రీ సింహా హీరోగా నటించిన మొదటి చిత్రం మత్తు వదలరా తో కాలభైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కాలభైరవ పాడిన అరవింద సమేత వీర రాఘవ సినిమా లోని పెనిమిటి పాట, తొలిప్రేమ సినిమా టైటిల్ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొందాయి.

శ్రీ సింహ యమదొంగ లో హీరో చిన్నప్పటి పాత్రలో నటించడమే కాకుండా ఆ సినిమా కోసం ఎన్టీఆర్ తో కలిసి ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేశాడు. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు మొదట తను కీరవాణి గారి కొడుకు అని చెప్పలేదట శ్రీ సింహ. ఈ విషయాన్ని మత్తు వదలరా సినిమా సమయంలో జరిగిన ఒక ఈవెంట్ లో స్వయంగా సుకుమారే చెప్పారు.

గతేడాది చివర్లో అంటే డిసెంబర్ లో మత్తు వదలరా రిలీజ్ అయింది. తర్వాత ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఏమి ప్రకటించలేదు శ్రీ సింహ. మొదటి సినిమాలోనే అంత బాగా నటించగలిగాడు అంటే నటుడిగా తనని తాను నిరూపించుకోవడం లో మొదటి స్టెప్ సక్సెస్ అయినట్టే. భవిష్యత్తులో శ్రీ సింహ మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని ఆశిద్దాం.


End of Article

You may also like