“ఇయర్ క్లీనింగ్” పేరుతో రోడ్ల మీద కొందరు చేసే ఈ మోసం గురించి తెలుసా.?

“ఇయర్ క్లీనింగ్” పేరుతో రోడ్ల మీద కొందరు చేసే ఈ మోసం గురించి తెలుసా.?

by Anudeep

మోసపోయే వాళ్ళున్నంత వరకు మోసం చేసే వారు పుడుతూనే ఉంటారు. కష్టించి పని చేసుకోకుండా, సులభం గా డబ్బు సంపాదించాలనుకునే వారు మోసం చేయడానికి తొందరగా ప్రయత్నం చేస్తారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు, ఈ మధ్య కొందరు అవకాశవాదులు అవతలి వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Video Advertisement

అలాంటి వారే ఈ స్కామ్ లకు పాల్పడుతుంటారు. ఈ స్కామ్ ఏంటి..? ఎలా చేస్తున్నారు అన్న విషయాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తి గా చదవండి.

Also Read: విగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?

మనం మామూలు గా సంవత్సరానికి ఒకసారి అయినా ఇయర్ క్లీన్ చేయించుకోవాలి. లోపల ఉండే గులిమి మన చెవి కి ప్రొటెక్టీవ్ గా నే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎక్కువ మొత్తం లో పేరుకు పోవడం కూడా మంచిది కాదు. అందుకే హాస్పిటల్ లో సర్టిఫైడ్ వైద్యుడి వద్ద చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ మన నిర్లక్ష్యం, హాస్పిటల్ కి ఎవరు వెళ్తారు లే అన్న ధోరణి కారణం గా.. చాలా మంది ఈ విషయాన్నీ పట్టించుకోరు.

సరిగ్గా ఈ పాయింట్ నే అవకాశం గా మలుచుకున్న కొందరు రోడ్ సైడ్ లో ఇయర్ క్లీనింగ్ పని ని మొదలు పెట్టేస్తున్నారు. ఓ చీపురు పుల్లకు కాటన్ చుట్టేసి వీరు మన చెవిలో ఉన్న వాక్స్ ను తొలగిస్తారు. ఇదంత శ్రేయస్కరం కాకపోయినా.. చీప్ గా పని అయిపోతుందన్న ఆలోచనలో చాలా మంది ఈ స్కామ్ లో పడుతున్నారు.

 

స్కాట్ అనే ఓ వ్యక్తి ఇండియా కి వచ్చినప్పుడు, వీధుల్లో తిరుగుతుండగా, ఇయర్ క్లీనింగ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. చెవిలోనుంచి ఓ చిన్న పుల్లతో తీస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మన చెవిలో అంత వాక్స్ ఉండదు. కానీ ఆ వ్యక్తి తీస్తూనే ఉన్నాడు, అంతే కాకుండా, ఇంకా చాలా ఉందని, తీయాలని చెప్తూ ఉన్నాడు. ఇందులోనే ఎదో స్కామ్ ఉంది. ఇలా చేసే వాళ్లలో చాలా మంది చెవి లో ఏమి లేకపోయినా, పదే పదే తీస్తున్నట్లు నటిస్తారు. మన చెవిలో పువ్వులు పెట్టి డబ్బులు తీసుకుంటారు.

Also Read: గ్యాస్ సిలెండర్ మీద నంబర్లు ఎప్పుడైనా గమనించారా.? దాని వెనకున్న అర్ధం ఏంటో తెలుసా.?

కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయం లో జాగ్రత్త వహించండి. అందరు ఇలా ఉంటారని కాదు, కానీ ఈ స్కామ్ ఇప్పుడు ఇండియా లో కూడా ఎక్కువ గా జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటివి రోడ్ సైడ్ చేయించుకోవడం అంత మంచిది కాదు. చెవి చాలా సున్నితమైన అవయవం కాబట్టి వైద్యుడిని సంప్రదించి క్లీన్ చేయించుకోవడం మంచిది.


You may also like