Ads
భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉంటాయి. అదే విధంగా ఈ సృష్టిలో మనం కళ్ళతో చూసినా సరే నమ్మలేనివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో వింత జీవులు మనకి కనపడడం జరుగుతూ ఉంటుంది. వాటిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి వాటికి సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయట పడ్డాయి అంటే వైరల్ అయిపోతాయి. రెండు తలల జంతువులు కానీ లేదంటే వింత జీవులకు సంబంధించిన వార్తలని నిత్యం మనం వింటూ ఉంటాం. తాజాగా ఓ వింత వార్త చోటు చేసుకుంది.
Video Advertisement
ఇప్పటి దాకా మనకి రెండు తలల పాము మాత్రమే కనపడి ఉంటుంది. కానీ ఈ పాముకి ఏకంగా మూడు తలలు ఉన్నాయి. ఇదేమీ ఫేక్ వార్త కాదు. నూటికి నూరు శాతం నిజం ఇది. నెట్ లో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే దీనిలో ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటంటే ఈ పాము చూడడానికి మూడు తలల పాములాగే ఉంది కానీ ఇది పాము కాదు. సాధారణమైన పురుగు అయితే దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగదు అని తెలుస్తోంది. దీనిపేరు అట్లాస్. సీతాకోకచిలుక జాతికి సంబంధించినది. మరొక విషయం ఏమిటంటే ఈ పురుగు కేవలం గుడ్లు పెట్టే సమయంలో మాత్రమే ఇలా ఉంటుందట.
అయితే పాము రూపంలో కనపడడం వల్ల ఆ పక్షుల నుండి వాటి గుడ్లను కాపాడుకోవడానికి ఇలా అవి మారుతాయి. అలానే మాంసాహార జంతువులు కూడా గుడ్లు జోలికి పోకుండా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాయి అని సైంటిస్టులు అంటున్నారు.
End of Article