మీరు బైక్/స్కూటర్ నడుపుతున్నారా..? అయితే మీ వెహికల్ కి ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే భారీ జరిమానా..!

మీరు బైక్/స్కూటర్ నడుపుతున్నారా..? అయితే మీ వెహికల్ కి ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే భారీ జరిమానా..!

by kavitha

Ads

మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ముందు బైక్ లేదా స్కూటర్ తీస్తాం.. రెగ్యులర్ ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించినా చాలా మంది బైక్స్ నే వాడతారు. అయితే, బైక్స్ వాడిన, కార్ లు వాడిన రోడ్డు పై వెళ్లేవారు ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించాలి. అయితే బైక్ లేదా స్కూటర్ లు వాడేవారు మాత్రం ఈ విషయాలను గమనించుకోండి.

Video Advertisement

bikes 2

మీరు బైక్ లేదా స్కూటర్ కి తప్పనిసరిగా రియర్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ, లేకపోతె కచ్చితం గా పెట్టించుకోండి. ఎందుకంటే, కొత్త వాహన చట్టం ప్రకారం బైక్స్ లేదా స్కూటర్లు కి తప్పనిసరిగా సైడ్ న రియర్ వ్యూ మిర్రర్స్ ఉండాలట. ఇవి లేకపోవడం వలన కూడా ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని తేలడం వలన ప్రభుత్వం వీటిని తప్పనిసరి చేసింది.

bikes

సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988లో సెక్షన్ 5 , 7 ల ప్రకారం ప్రతి బైక్ లేదా స్కూటర్ కి తప్పనిసరిగా రియర్ వ్యూ మిర్రర్ ఉండాలి. రియర్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్లు లేకపోవడం వలన ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయని ఓ సర్వే లో వెల్లడి కావడం తో ఈ రూల్స్ తీసుకొచ్చారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఈ సర్వే నిర్వహించగా.. ఈ విషయం బయటపడింది.

bikes 3

ఇకపై ఈ రూల్స్ ని అతిక్రమిస్తే.. పోలీసులు మీకు జరిమానా విధిస్తారు. మనలో చాలా మంది రియర్ వ్యూ మిర్రర్లను తీసివేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ లో రియర్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్స్ ను కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేసారు. కాబట్టి, మీరు కూడా చెక్ చేసుకోండి.


End of Article

You may also like