ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అరవైల్లో కూడా ఇరవయేళ్ళ అమ్మాయితో ఆడిపాడతారు కానీ హీరోయిన్స్ కి మాత్రం ముప్పై, ముప్పై ఐదు ఏళ్ళు వస్తే చాలు మెల్లి మెల్లిగా పక్కన పెట్టేస్తారు. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్స్ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు.

Video Advertisement

ఏడాది క్రితం వరకు సమంత, కాజల్, తమన్నా, రష్మిక, పూజా హెగ్డే, రకుల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ హీరోయిన్లకు బదులుగా కృతిశెట్టి, శ్రీలీల, కేతిక శర్మ, శివానీ, మీనాక్షి చౌదరీ పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ హీరోయిన్లతో పాటు యంగ్ హీరోయిన్ నేహాశెట్టి పేరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. యంగ్ హీరోయిన్లు తర్వాత సినిమాలతో సక్సెస్ లను అందుకుంటే ఈ హీరోయిన్లకు స్టార్ హీరోయిన్లుగా ప్రమోషన్ దక్కుతుంది. కాజల్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం కాగా రీఎంట్రీ ఇచ్చినా గతం ఉన్నంత క్రేజ్ ఉండకపోవచ్చు. తమన్నాకు కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’లో సత్య దేవ్ తో కలిసి నటిస్తుంది.

మరోవైపు సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాల ఫలితాలపైనే సమంత కెరీర్ ఆధారపడి ఉంది. అయితే పాన్ ఇండియా హీరోలు సమంతపై దృష్టి పెట్టడం లేదు. పుష్ప ది రైజ్ విజయం సాధించినా ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్లాప్ రష్మిక కెరీర్ పై ప్రభావం చూపుతోంది. మరో హీరోయిన్ పూజా హెగ్డే కు కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. పూజా హెగ్డే చేతిలో కొన్ని ఆఫర్లు ఉన్నా ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది.


రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి ఫ్లాపులు పూజ కెరీర్ కు మైనస్ అయ్యాయి. ప్రస్తుతానికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒకటి, బాలీవుడ్ లో మరో చిత్రం చేయనుంది. యంగ్ హీరోయిన్ల నుంచి ఈ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే ఈ హీరోయిన్లలో రేపు ఎంత మంది స్టార్ హీరోయిన్లు అవుతారో, ఎంతమంది ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరమవుతారో చూడాలి.