హోటల్ లో పని చేస్తూ చదువుకున్నాడు… ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయ్యి 100 కోట్లకు పైగా సంపాదించాడు..! ఇతను ఎవరో తెలుసా..?

హోటల్ లో పని చేస్తూ చదువుకున్నాడు… ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయ్యి 100 కోట్లకు పైగా సంపాదించాడు..! ఇతను ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇప్పుడు పెద్ద స్థానంలో ఉన్న ఎవరైనా సరే ఎక్కడో చిన్న చోటి నుండి మొదలు పెడతారు. చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇవాళ ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అనే విషయం కూడా తెలియదు. చాలా మంది చిన్న ఉద్యోగాలతో మొదలుపెట్టి, ఇప్పుడు లక్షల సంపాదిస్తున్నారు. డబ్బు లేని స్థాయి నుండి ఇవాళ కోట్లకు అధిపతి అయ్యారు. ఈ వ్యక్తి కూడా అలాంటి ఒక వ్యక్తి. యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. ఇతని పేరు భువన్ బామ్. ఢిల్లీలో ఉన్న ముఘలాని రెస్టారెంట్ అనే ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకున్నారు. జనవరి 22వ తేదీ, 1994 లో గుజరాత్ లోని, వడోదరలో ఉన్న ఒక మరాఠీ ఫ్యామిలీలో భువన్ బామ్ పుట్టారు.

Video Advertisement

youtuber bhuvan bam inspirational story

తర్వాత కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే భువన్ బామ్ చదువుకున్నారు. 2021 లో కోవిడ్ కారణంగా ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు. బీబీ కి వైన్స్ పేరుతో చేసిన వీడియోల ద్వారా భువన్ ఫేమస్ అయ్యారు. దాంతో పాటు కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు.భువన్, బాంచోద్ దాస్, సమీర్ ఫడ్డీ, టిటు మామా, బబ్లు, జాంకీ, శ్రీమతి వర్మ, అద్రాక్ బాబా, మిస్టర్ హోలా, పాప మాకిచు, డిటెక్టివ్ మాంగ్లూ, డాక్టర్ సెహగల్ మరియు బబ్లీ సర్ అనే పాత్రల ద్వారా యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. టెడ్ టాక్స్ లో కూడా మాట్లాడి తన కథని చెప్పారు.

youtuber bhuvan bam inspirational story

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ముందు తన తల్లిదండ్రులని మీ కొడుకు ఏం చేస్తాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్లు అని, ఆ తర్వాత అందరూ పొగిడారు అని చెప్పారు. ప్లస్ మైనస్ అనే ఒక షార్ట్ ఫిలిం భువన్ బామ్ కి నటుడిగా పేరు తీసుకొచ్చింది. ఇందులో నటి దివ్య దత్తా తో కలిసి నటించారు. 2023 లో తాజా ఖబర్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు. నటించడం మాత్రమే కాకుండా ఈ సిరీస్ కి ఒక నిర్మాత గా కూడా వివరించారు. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సిరీస్ కి రెండవ సీజన్ కూడా ఉంది. అది కూడా త్వరలో విడుదల అవుతుంది. అలా, భువన్ బామ్ ఎంతో మంది యూట్యూబర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.

ALSO READ : 22 ఏళ్ళ శ్రీలీల పక్కన ఆ 52 ఏళ్ళ హీరోనా.? కూతురు లాగా ఉంటుంది కదా అంటూ ట్రోల్స్.!


End of Article

You may also like