Ads
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతి దంపతులకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చిన్ననాటి ఫోటోలు, పెళ్లినాటి ఫోటోలు అంటూ రకరకాల ఫోటోలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి పత్రిక ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.
Video Advertisement
1996 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పెళ్లి జరిగింది. పెళ్లినాటికి జగన్మోహన్ రెడ్డి వయసు 24 సంవత్సరాలు.పులివెందులకు చెందిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి కుమార్తె భారతితో ఆగస్టు 28 ఉదయం 10 గంటల 30 నిముషములకు వైఎస్ జగన్, భారతిల పెళ్లి ఘనంగా జరిగింది.
అదే రోజు వైఎస్ వివేకానంద కుమార్తె సునీత వివాహం జరగడం కూడా విశేషం. జగన్మోహన్ రెడ్డి, సునీతలకు సంబంధించి పెళ్లి పత్రికను ఒకే కార్డు పై ముద్రించి పంచారు. కడప జిల్లాలో ఉన్న లయోలా కాలేజీ గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి భారతి ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది.జగన్, భారతిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పేరు హర్షారెడ్డి, చిన్న కుమార్తె పేరు వర్షా రెడ్డి. ప్రస్తుతం హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదవుకుంటున్నారు. చిన్న కుమార్తె అయిన వర్షా రెడ్డి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
ప్రస్తుతం భారతి సాక్షి పత్రికను, భారతి సిమెంట్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తర్వాత 2009 సంవత్సరంలో కడప ఎంపీగా గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం తర్వాత 2014లో ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
End of Article