వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? ఎవరు ఎంత పెద్ద అంటే.?

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? ఎవరు ఎంత పెద్ద అంటే.?

by Mohana Priya

Ads

వైయస్ జగన్మోహన్ రెడ్డి. పరిచయం అక్కర్లేని వ్యక్తి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేశంలోనే యంగెస్ట్ సీఎం. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. దేశంలో ఉన్న మాస్ పొలిటికల్ లీడర్స్ లో జగన్ ఒకరు. పట్టుదల కి మొండితనానికి జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు. అనుకున్నది చేసేదాకా వదిలిపెట్టరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయానికి వస్తే. ఈయన భార్య పేరు వైయస్ భారతి రెడ్డి. ఏమి కూడా రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ముందుండి పార్టీని నడిపించిన వ్యక్తుల్లో ఈమె ఒకరు.

Video Advertisement

సాక్షి గ్రూప్ కి చైర్మన్. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిల వివాహం లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కథనం మీకోసం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మెడిసిన్ చదువుకునేటప్పుడు ఆయనకు సుగుణ రెడ్డి అనే స్నేహితురాలు ఉండేవారు. సుగుణ రెడ్డి కుమార్తె భారతి రెడ్డి. ఈమెను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువురు అనుకున్నారు. అలా మొదటిసారి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడే ఒకరికి ఒకరు నచ్చేసారు. వీళ్ళ లవ్ స్టోరీ 1996 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అదే సంవత్సరం ఆగస్టు 28న వీరి వివాహం అయింది. పెళ్లి సమయానికి జగన్మోహన్ రెడ్డి వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే.

ys jagan mohan reddy love story

వైయస్ జగన్మోహన్ రెడ్డి 1972 లో డిసెంబర్ 21వ తేదీన పుట్టారు. వైయస్ భారతి, డిసెంబర్ 9వ తేదీ 1977 లో పుట్టారు. అంటే, వీరిద్దరికి 5 సంవత్సరాల వయసు తేడా ఉంది. పెళ్లి జరిగే సమయానికి జగన్ మోహన్ రెడ్డి వయసు 24 సంవత్సరాలు అయితే, భారతి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. చాలా చిన్న వయసులో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకరి పేరు వర్ష, ఇంకొకరి పేరు హర్ష. వీరిద్దరూ కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఎప్పుడైనా ఒకసారి జగన్మోహన్ రెడ్డి, భారతి వెళ్లి కూతుళ్ళతో సమయాన్ని గడిపి వస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ALSO READ : IPL 2024 : ఈసారి ఐపీఎల్ అమలులోకి రానున్న3 కొత్త నియమాలు ఇవే..! ఎఫెక్ట్ పడేది బ్యాటర్ల మీదేనా..?


End of Article

You may also like