Ads
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం.. చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. ఎలాంటి ఒత్తిడి ఆయనలో కనిపించదు. అంతేకాదు చాలా ఫిట్ గా ఉంటారు. సాధారణంగా అందరూ పని ఒత్తిడి లోనైనప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. కానీ ముఖ్యమంత్రిగా అంతటి ఒత్తిడిలోను కచ్చితంగా డైట్ ను జగన్ ఫాలో అవుతారు. మొదటి నుంచి ఆయన ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకునేవారు. ఇప్పుడు ఆయన కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసుకుందాం..
Video Advertisement
మామిడికాయ తురిమి చేసే పులిహోర అంటే జగన్‌కు చాలా ఇష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేసే సమయంలో కూడా ఎప్పుడు విజయవాడ వచ్చినా కచ్చితంగా ఆయన భోజనంలో మామిడికాయ పులిహోర తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే జగన్ రోజూ ఓ లీటరు పాలలో పచ్చి అల్లం వేసి బాగా మరిగిస్తే..కేవలం ఓ గ్లాసు పాలు మాత్రమే అయ్యేవరకు ఉంచి తాగుతారట.
సీఎం జగన్ ఉదయం 4.30కి మొదవుతుంది. ప్రతిరోజూ 4.30 గంటల నుంచి గంట పాటు యోగా, జిమ్ వంటివి చేస్తారు. ఆ టైమ్ లో కేవలం టీ మాత్రమే తాగుతారు. ఏడు గంటల సమయంలో జూస్ తీసుకుంటారు. ఉదయం టిఫిన్ చేయరు. కొన్ని డ్రైఫ్రూట్స్ మాత్రం తింటారు. ఇక వివిధ అంశాలు, శాఖలపై సమీక్షలు జరిపే సమయంలో చాక్లెట్ బైట్స్ తింటారు. మధ్యాహ్నం లంచ్ లో పుల్కా లు తీసుకుంటారు. అప్పుడప్పుడు రాగిముద్ద, మటన్ కీమాను లంచ్ లో తీసుకుంటారు.
అలాగే రాయలసీమ ఫేమస్ చిత్రాన్నం కూడా రెగ్యులర్‌గా తింటారట. పల్లీలు, మొక్కజొన్న పొత్తులు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటారట.. ఫ్రూట్స్ జ్యూస్‌లు ఆయన డైలీ మెనూ లో ఉంటాయట. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మద్యానికి ఆయన దూరం. వీకెండ్ లో పూర్తిగా కుటుంబంతోనే గడిపే జగన్.. సండే వస్తే బిర్యానీ, చేపల పులుసు, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలను ఆరగిస్తారు. జగన్ ఎన్నిరకాల వంటలు ఇష్టపడినా మితంగానే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు.
End of Article