“వైఎస్ రాజశేఖర రెడ్డి” గారి పెళ్లి పత్రిక చూసారా..? అందులో ఏం రాసి ఉంది అంటే..?

“వైఎస్ రాజశేఖర రెడ్డి” గారి పెళ్లి పత్రిక చూసారా..? అందులో ఏం రాసి ఉంది అంటే..?

by kavitha

Ads

రాజన్న అని ఆత్మీయంగా తెలుగు ప్రజలు పిలుచుకునే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. తాజాగా ఆయన వివాహ పత్రిక వెలుగులోకి వచ్చింది. ఈ పత్రికను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ వివాహ పత్రికలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వెడ్డింగ్ కార్డ్ లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వివాహం రాజేశ్వ‌రితో అన్నట్లుగా ఉంది. విజ‌య‌మ్మ‌తో కాదా ఆయన వివాహం జరిగింది. ఆయన భార్యగా గౌరవం పొందుతున్నది ఆమెనే. మధ్యలో ఈ రాజేశ్వ‌రి ఎవరు ఆలోచనలు మొదలయ్యాయి. కానీ ఇది నిజ‌మే. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పెళ్లి వాస్తవంగా రాజేశ్వ‌రితోనే అందరి మధ్య జ‌రిగింది. ఆ పెళ్లి పత్రికలో ”వైఎస్ రాజారెడ్డి, జ‌య‌మ్మ‌ల ద్వితీయ పుత్రుడైన వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డికి, రామాంజుల‌రెడ్డి, తుల‌శ‌మ్మల ప్ర‌థ‌మ కుమార్తె రాజేశ్వ‌రి” తో పెళ్లి అని ఉంది. ఎంతో వైభ‌వంగా జ‌రిగిన ఈ పెళ్లికి భారీగా ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారట.ఇంత‌కి విజ‌య‌మ్మ ఎవ‌రనే ప్రశ్న అందరిలో వస్తుంది అయితే  ఈ విష‌యాన్ని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భార్య విజ‌య‌మ్మ రాసిన  ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ అనే పుస్త‌కంలో వివ‌రించారు. అందులో ఆమె వారి పెళ్లి విష‌యాల‌ను వివ‌రించారు.

పులివెందుల‌ గ్రామానికి చెందిన పొచిమిరెడ్డి రామాంజ‌నేయుల రెడ్డి (పెళ్లి కార్డులో మాత్రం రామాంజి రెడ్డి అని ఉంది) మొదటి కుమార్తె విజ‌య‌మ్మ. ఆమె ఇంట‌ర్ పూర్తి అయ్యాక, పులివెందుల‌కు చెందిన వైఎస్ రాజారెడ్డి రెండవ కొడుకు  డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో పెళ్లి కుదిర్చారు.
వాస్తవానికి విజ‌య‌మ్మ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. వారి ఫ్యామిలీ హిందూమ‌త‌స్తులు. రాజారెడ్డి ఫ్యామిలీ క్రిస్టియ‌న్లు. అందువల్ల వివాహాన్ని క్రిస్టియ‌న్ పద్ధతిలో చేయాల‌నుకున్నారు. దాంతో పాస్ట‌ర్‌ను పిలిచారు. కాబోయే వధూవరుల  పేర్ల‌ను ప‌రిశీలించి, ఇద్ద‌రు సమానంగా ఉండాలంటే అమ్మాయి పేరు మార్చాల‌ని చెప్పారు. ఆ క్రమంలో విజ‌య‌ల‌క్ష్మి పేరును రాజేశ్వ‌రిగా మార్చారు.  అలానే పెళ్లి పత్రికలో కూడా ముద్రించారు. అంటే విజయమ్మే ఆ పత్రికలోని రాజేశ్వరి. 1972లో ఫిబ్ర‌వ‌రి 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌రిపించారు.

Also Read: “నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like