Ads
భగవంతుడిని, భక్తుడిని దగ్గర చేసేది భక్తి మాత్రమే. అయితే.. పూజ చేసుకోవడానికి ముందు కావాల్సింది భక్తి. ఆ తరువాతే ఈ నియమాల గురించి చర్చలు జరపాలి. చాలా మంది ప్రతిరోజు ఉదయమే పూజ చేసుకుంటారు. కొందరికి ఇంట్లోనే చిన్న మందిరం లా ఏర్పాటు ఉంటుంది. కొందరికి ప్రత్యేకం గా పూజ గది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
Video Advertisement
అయితే, చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే, పూజ అయిపోగానే తలుపులు వేసేయచ్చా.. లేదా దీపారాధన వెలుగుతున్నంత సేపు తలుపు తీసే ఉంచాలా..? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. కొందరు పూజ అయిపోయాక వెంటనే తలుపులు వెయ్యలేక.. దీపారాధనకు కొండెక్కించేసి మరీ తలుపులు వేసేస్తుంటారు. ఇది చాలా తప్పు. తెలిసో.. తెలియకో ఇలా చాలా మంది చేస్తుంటారు. ఇలా ఎప్పుడు చేయకండి. భగవంతుడికి భకి మాత్రమే ప్రధానం.
కాబట్టి పూజ పూర్తి అయ్యాక తలుపులు వేయడం ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. పూజ గదిలో అయినా.. మందిరం అయినా.. పూజ చేసుకునేటప్పుడు తలుపులు తీసుకుని కూర్చుంటాం. కొంతసేపటికి పూజ పూర్తయ్యాక తలుపులు దగ్గరగా వేసుకోవడం లో ఎలాంటి ఆక్షేపణా ఉండదు. దీపం వెలుగుని పంచుతుంది. పూజగదిలో వెలుగు ఉండడం వలన వచ్చే నష్టం ఏమి లేదు కదా.. దీపం కొండెక్కించడం కన్నా… దీపారాధన వెలుగులోనే దేవుడిని ఉంచి తలుపులు వేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
End of Article