Ads
సాధారణం గా మహిళలు తమ ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. బాగానే ఉన్నాం అనుకుంటారు. ముఖ్యం గా 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు మహిళలకు ఎంతో కీలకమైనది. ఈ వయసు లో చాలా మంది సంసార జీవితం ప్రారంభిస్తారు. ఎన్నో బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. చాల మంది ఈ వయసులో ఆక్టివ్ గానే ఉన్నాం అనుకుంటారు. కానీ ఇది తప్పు. కచ్చితం ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ ఈ ఐదు టెస్ట్ లు చేయించుకోవాలి.
Video Advertisement
బరువు కొలవడం: నేషనల్ హెల్త్ పోర్టల్ ప్రకారం, మహిళలు తమ శరీర బరువును ప్రతిరోజూ కొలవాలి. మీ BMI సరిగ్గా ఉండాలి. లేకపోతే ఫ్యూచర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రక్తపోటు – అధిక రక్తపోటు కలిగి ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మహిళలు ఎప్పటికప్పుడు తమ బీపీ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉంటె తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
కొలెస్టిరాల్ చెక్: అలాగే.. 20 ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండ కొలెస్టిరాల్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. నేషనల్ హెల్త్ పోర్టల్ ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్ చెకప్ చేయాలని చెబుతోంది.
రొమ్ము పరీక్ష, కటి పరీక్ష మరియు పాప్ పరీక్ష: రొమ్ము పరీక్ష మరియు కటి పరీక్షలు చేయడం ద్వారా భవిష్యత్తులో అనేక క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అలాగే మూడేళ్లకు ఒకసారి అయినా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఐ టెస్ట్: బాగానే కనిపిస్తోంది కదా అని చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోరు. కానీ.. ఏడాదికి ఒకసారి అయినా ఈ పరీక్షా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
End of Article