విష్ణుమూర్తి దశావతారాలు ధరించడం తెలుసు… కానీ, శివపార్వతులు ధరించిన ఈ 10 అవతారాల గురించి మీకు తెలుసా..?

విష్ణుమూర్తి దశావతారాలు ధరించడం తెలుసు… కానీ, శివపార్వతులు ధరించిన ఈ 10 అవతారాల గురించి మీకు తెలుసా..?

by Anudeep

Ads

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు పలు రూపాలలో వచ్చి భక్తులను కాపాడుతూనే ఉంటాడనడానికి మన పురాణాలే సాక్ష్యాలు. ధర్మ రక్షణ కోసం ఎన్ని అవతారాలనైనా ఎత్తుతానని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు.

Video Advertisement

విష్ణుమూర్తి కూడా దశావతారాలను ఎత్తి ధర్మాన్ని సంరక్షించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే.. శివపార్వతులు కూడా లోక కల్యాణార్థం అవతారాలను ఎత్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాము.

అవతారం అంటే రూపం మార్చుకోవడం మాత్రమే కాదు.. మనుష్యులతో పాటు ఇతర జీవ రూపాల్ని ధరించి దివి నుంచి భువికేగి.. భూలోకం లో క్షేమాన్ని చూడడం. లోకం లో ధర్మం నడుస్తున్నంత కాలం ఇబ్బందులు రావు. ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే ధర్మం నశించి.. అధర్మం ఎక్కువవుతుందో అప్పుడు చెడు పెరుగుతుంది. కష్టాలు ఎక్కువ అవుతాయి. అటువంటి సమయం లోనే భక్తులను కాపాడుకోవడానికి దేవుడు దిగివస్తాడు. సరైన సమయం చూసి, భగవంతుడు భక్తులకు అవసరమైన క్షణం లో వచ్చి కష్టాలను గట్టెక్కిస్తాడు. అలా పార్వతి పరమేశ్వరులు ఈ కింది అవతారాలను ధరించారు.

siva parvathi 1

అవతారం 1 :
ఆది దంపతులిద్దరూ మహాకాళుడు, మహాకాళి గా అవతరించి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారు.

అవతారం 2 :
పరమేశ్వరుడు తారకావతారం ధరించగా, తారకాదేవి గా పార్వతి దేవి జన్మించి ఆయనకు అర్ధాంగి అయినది. వీరు భక్తులకు సకల శుభాలను ప్రసాదిస్తారు.

siva parvathi 5

అవతారం 3 :
శివ పార్వతులు బాలభువనేశ్వరుడు, బాలభువనేశ్వరి దేవి గా అవతరించి సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.

అవతారం 4 :
షోడశ విశ్వేశ్వరుడు, షోడశ విశ్వేశ్వరి గా అవతరించిన పార్వతి పరమేశ్వరులు భక్తులకు సర్వ సుఖాలను ప్రసాదిస్తారు.

siva parvathi 3

అవతారం 5 :
శివుడు భైరవ అవతారం ధరించగా, పార్వతి భైరవి అవతారాన్ని ధరించి ఉపాసించిన వారికి కోరిన కోరికలు తీరుస్తారు.

అవతారం 6 :
ఈ అవతారం లో శివ పార్వతులు భిన్న మస్త, భిన్న మస్తకి గా పేరు పొందారు.

siva parvathi 4

అవతారం 7 :
ధూమవంతుడు, ధూమవతి గా కూడా శివ పార్వతులు అవతరించి భక్తులను రక్షించారు.

అవతారం 8 :
పార్వతి పరమేశ్వరులు బగళాముఖుడు — బగళాముఖి గా కూడా అవతరించారు. బగళాముఖీ అమ్మవారిని బహానంద అని కూడా పిలుస్తారు

siva parvathi 2

అవతారం 9 :
మాతంగి, మాతంగుడు గా కూడా అవతరించిన శివ పార్వతులు ఈ జగత్తు కి తల్లితండ్రులుగా నిలిచారు.

అవతారం 10 :
ఇక పదవ అవతారం లో శివ పార్వతులు కమలుడు, కమల గా అవతరించారు.


End of Article

You may also like