ఈ 10 ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ కేటగిరీనా? ఇప్పటి వరకు వెజ్ ఫుడ్ అనుకున్నాం కదా..!?

ఈ 10 ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ కేటగిరీనా? ఇప్పటి వరకు వెజ్ ఫుడ్ అనుకున్నాం కదా..!?

by Anudeep

Ads

ఫుడ్ ఒకప్పుడు బతకడం కోసం తినేవారు. ఇప్పుడు వస్తున్న ఫుడ్ వెరైటీస్ అన్ని నోరూరిస్తుంటే వాటిని తినడం కోసమైనా బతకాలనిపించేలా ఉంటున్నాయి. బేసిక్ గా మనుషులందరూ ఫుడ్ లవర్స్.

Video Advertisement

కొందరు ఎక్కువ ఇష్టపడతారు. కొందరు తక్కువ ఇష్టపడతారు అంతే తేడా. ఈ ఫుడ్ లవర్స్ లోనే మళ్ళీ రెండు రకాలు ఉంటారు. వెజిటేరియన్స్ మరియు నాన్ వెజిటేరియన్స్.

మనకు దొరికే ఫుడ్ నే రెండు రకాలుగా విభజించుకున్నాం. మాంసం కానిది, మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారాన్ని వెజ్ ఫుడ్ గా, ఇతర జీవులనుంచి వేరు చేసిన మాంసాన్ని నాన్ వెజ్ గా నిర్ణయించుకున్నాం. ఏదైనా ఫుడ్ చూపించగానే అది వెజ్ ఫుడ్ లేదా నాన్ వెజ్జా అన్నది మనం చెప్పేయగలం. కానీ.. మనం వెజ్ అనుకుంటున్న పదార్ధాలు చాలా వరకు నాన్ వెజ్ పదార్ధాలట. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 నాన్:

1 naan
మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా.. లేదంటే ఏ పార్టీ సెలబ్రేషన్ కో లంచ్ లేదా డిన్నర్ అరెంజ్ చేసుకున్నా స్టార్టర్స్ తో పాటు నాన్ ను కూడా కచ్చితం గా ప్లాన్ చేసుకుంటాం. చాలా మంది నాన్ వెజ్ ఫుడ్ అనే అనుకుంటూ ఉంటారు. అన్ని రకాలు వెజ్ ఫుడ్ కాదు. కొన్ని నాన్ లను ప్రిపేర్ చేసేటపుడు పిండి లో ఎగ్ ను కలుపుతారు. సాఫ్ట్ నెస్ కోసం ఇలా చేస్తూ ఉంటారు.

#2 సలాడ్

2 salad
సలాడ్ లో అన్ని ఉండేది వేజిటబుల్స్ మాత్రమే కదా.. ఇది ఎందుకు వెజ్ ఫుడ్ కాదు అనుకుంటున్నారా? కొన్ని రకాల సలాడ్స్ లో పైన డెకరేట్ చేసే సలాడ్ డ్రెస్సింగ్ లో ఎగ్ ఉంటుంది. ఇది ఆప్షనల్ కాబట్టి.. మీకు కావాలని అనుకుంటే వేసుకోవచ్చు.. లేదంటే ఆర్డర్ చేసినప్పుడు ఇది వాడొద్దని చెప్పాల్సి ఉంటుంది.

#3 చీజ్:

3 cheese
చీజ్ లేకుండా మనకి చాలా ఫాస్ట్ ఫుడ్స్ ఉండవు. చీజ్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..? కానీ ఇందులో ఏమి నాన్ వెజ్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? ఇందులో “రెనెట్స్” అనే పదార్ధం ఉంటుంది. ఇది జంతువుల చిన్న ప్రేవుల నుంచి తయారయ్యే ఒక ఎంజైమ్. చీజ్ పాకెట్స్ పై కూడా ఇది మెన్షన్ చేయరు. కాబట్టి ఇది చాలా మందికి తెలిసే అవకాశం లేదు.

#4 ఆయిల్స్:

4 oils
ఆయిల్ లేకుండా ఏ వంటకం తయారవ్వదు. దాదాపు అన్ని ఆయిల్ కంపెనీ లు తమ ఆయిల్ హార్ట్-ఫ్రెండ్లీ అంటూ యాడ్ లు ఇస్తూ ఉంటారు. ఒమేగా-3 ఆసిడ్స్ ఉన్న ఆయిల్స్ ను ఫిష్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తారు. అలాగే.. కొన్ని ఆయిల్స్ తయారీ లో లానోలిన్ నుంచి తీయబడిన డి విటమిన్ ని కలుపుతారు. ఈ లానోలిన్ అనే పదార్ధం గొర్రెల నుంచి వస్తుంది.

#5 బీర్

5 beer
వీకెండ్ వచ్చిందంటే చాలా మంది అబ్బాయిలు బీర్ తాగడానికే సిట్టింగ్ వేస్తూ ఉంటారు. కానీ బీర్ తయారు చేసేటపుడు ఇందులో ఇసింగ్లాస్ అనే పదార్ధం వాడతారు. బీర్ గోల్డెన్ కలర్ లో కనిపించడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఫిష్ బ్లాడర్ నే ఇసింగ్లాస్ అని పిలుస్తారు. వైన్ తయారీ లో కూడా దీనిని ఉపయోగిస్తారు.

#6 వైట్ షుగర్

6 white sugar
పంచదార లేకుండా మనకి పొద్దున్నే కాఫీ తాగాలని అనిపించదు. ఈ షుగర్ క్లియర్ గా, వైట్ క్రిస్టల్స్ లాగ ఉంటుంది కదా. నాచురల్ గా తయారు చేయబడ్డ షుగర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ తరువాత ఇది వైట్ గా అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ లో నాచురల్ కార్బన్ ని వినియోగిస్తారు. ఈ నాచురల్ కార్బన్ ఎక్కడనుంచి వస్తుందో తెలుసా? అనిమల్ బోన్స్ నుంచి ఈ నాచురల్ కార్బన్ ను సేకరించి షుగర్ తయారీ లో వాడతారు.

#7 రెడ్ కాండీస్


అట్ట్రాక్టీవ్ గా కనిపించే రెడ్ కాండీస్ ని ఇష్టపడనివారెవరు. కానీ ఈ కాండీస్ ని తయారు చేసే క్రమం లో ఫుడ్ డైస్ వాడతారు. ఈ ఫుడ్ డైస్ కి ఆ కలర్ ఎలా వస్తుందంటే ఇన్సెక్ట్స్ మరియు ఇతర క్రిమికీటకాల నుంచి రంగు సేకరిస్తారు.

#8 డోనట్స్

8 donuts
చాల మంది ఫేవరెట్ స్వీట్ ఫుడ్ డోనట్స్. చాల మంది వీటిని వెజ్ ఫుడ్ అనే అనుకుంటారు. కానీ కాదు. వీటిలో ఎల్. సిస్టీన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది బాతు ఈకలు మరియు పంది ట్రోటర్లతో తయారు చేయబడింది.

#9 చూయింగ్ గమ్స్

9 chewing gum
వీటిని ఊరికే టైం పాస్ గా తింటూ ఉంటాము. ఇందులో చూయింగ్ గమ్ ను మనం నమిలి పారేయడమే తప్ప తినలేము. ఈ చూయింగ్ గం లో జెలటిన్ ఉంటుంది. సాగే లక్షణం కోసం దీనిని వినియోగిస్తారు. జెలటిన్ చర్మం, లిగమెంట్స్, ఎముకలు మరియు ఆవులు మరియు పందుల లిగమెంట్స్ నుండి తీసుకోబడింది.

#10 చాకోలెట్స్

chocolate
చాకొలేట్ కూడా నాన్ వెజ్జా అని అనుకోకండి. ఇందులో కూడా “రెన్నెట్” అనే ఎంజైమ్ ఉంది. ఇది ఆవు వధించిన తరువాత కడుపు నుండి తీయబడుతుంది.


End of Article

You may also like