ప్రతి నెలలోను శని త్రయోదశి వస్తూనే ఉంటుంది. కానీ, ఈ ఏడాది జనవరి నెలలో వస్తున్న శని త్రయోదశి మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. దాదాపు 180 ఏళ్ల తరువాత ఇటువంటి శని త్రయోదశిని మనం చూడబోతున్నాం. జనవరి 15 న శని త్రయోదశి వస్తోంది. శని దేవుడికి అత్యంత ప్రీతికరమైన ఈరోజు చాలా విశిష్టతని కలిగి ఉంది.

ఈరోజున మీకు ఉన్న కష్టనష్టాల గురించి, కోరికల గురించి సంకల్పం చెప్పుకుంటే అవి కచ్చితంగా నెరవేరుతాయి. ఇది కేవలం శని దేవుడికి మాత్రమే సంబంధించినది కాదు. శివకేశవులిద్దరికీ సంబంధించినది కూడా.

శని కర్మకారకుడు. అందుకే.. ఆయనను వేడుకుంటే కష్టాల నుంచి సునాయాసంగా గట్టెక్కిస్తాడు. ఈ ఏడాది ఆయన మకర రాశిలో సంచరిస్తున్నారు. తత్ఫలితంగా కొన్ని రాశులవారు శని ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. కుంభం, మకరం, ధనుస్సు, కన్య, కర్కాటకం, మిధునం, మేషం, వృషభ రాశి వారు ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.

mesha rasi 1

మేష రాశి: ఈ రాశి వారికి కారణం లేకుండా శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. నిద్ర పట్టకుండా ఆలోచనలు ముసురుకుంటాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉండదు.

vrushabha rasi

వృషభ: శని ప్రభావంతో వీరికి కూడా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. లాభాలు కలిసి వస్తాయి.. కానీ నమ్మి మోసపోవడం వలన నష్టాలలో ఉంటారు. తోడబుట్టినవారితో విబేధాలు తలెత్తుతాయి.

midhunam

మిధునం: వీరు సంతానం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిలో ఇబ్బందులు, డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

karkataka rasi

కర్కాటకం: వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల విషయంలో విబేధాలు కొనసాగుతాయి. డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. మానసికంగా ప్రశాంతత కూడా ఉండదు.

kanya rasi

కన్య: వీరికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్య భర్తలు, తల్లి వైపు వారు, వ్యాపార భాగస్వామ్యులతోను గొడవలు వచ్చే అవకాశం ఉంది. తోటివారితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది.

tula rasi

తులా రాశి: ఈ రాశి వారికి అర్దాష్టమ శని ప్రభావం ఉంటుంది. వీరి ఏ పని చేయాలన్న అనాసక్తి ఏర్పడుతూ ఉంటుంది. రోగ సమస్యలు, శత్రు భయం ఎక్కువ ఉంటుంది. అనుకోకుండా వాహన ప్రమాదాలు జరుగుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. వీరి కీర్తి ప్రతిష్టతలకి కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

ధనుస్సు: వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉండడం వలన కుటుంబపరంగా సామాజిక పరంగా ఇబ్బందులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. అప్పులు ఇస్తే డబ్బు తిరిగి రాకపోవడం, మాటలు పడాల్సి రావడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి.

మకరం: ఈ రాశి వారికి ధన సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ప్రశాంతతని కోల్పోతారు.

కుంభం: వీరికి కూడా ఏలినాటి శని నడుస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

పరిష్కార మార్గం:
ఇటువంటి శని ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే.. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. 180 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ శని త్రయోదశి రోజున ఉదయాన్నే నల్ల నువ్వుల నూనెను పెట్టుకుని తలారా స్నానం చేయాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లి అక్కడ నవగ్రహాల మంటపం వద్ద 54 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. శివాయ నమ: అని మనసులో జపించుకోవాలి. అన్నం, నల్ల నువ్వులు కలిపి శని దేవుడికి నైవేద్యం పెట్టి, ఆ తరువాత కాకులకు తినిపించాలి.