23 ఏళ్లకే రూ.100 కోట్ల టర్నోవర్ సంపాదించాడు..! ఇంతకీ ఇతను ఎవరు..?

23 ఏళ్లకే రూ.100 కోట్ల టర్నోవర్ సంపాదించాడు..! ఇంతకీ ఇతను ఎవరు..?

by Anudeep

Ads

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించాలి అనుకుంటే ముందుగా మనకు స్టాక్ మార్కెట్ పైన పూర్తి అవగాహన అవసరం. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి ? ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి? అనేవి తెలియాలి. కానీ చాలా మందికి స్టాక్ మార్కెట్స్ అంటేనే భయం. పొరపాటున ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటామో అని పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే స్టాక్ మార్కెట్ లో తలలు పండినవారే అప్పుడప్పుడు నష్టాలను ఎదుర్కొంటారు. కానీ ఒక 23 ఏళ్ళ యువకుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా 100 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇతని సక్సెస్ స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుందాం..

23 year old youth makes 100 crore net worth.. know how..!!

హైదరాబాద్ కి చెందిన సంకర్ష్ చందా 17 ఏళ్ల వయసులో కేవలం రూ.2,000తో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ఆలా మొదలై ఒక ఏడాదిలోనే రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఆ మొత్తం రెండేళ్లు గడిచేసరికి రూ.13 లక్షలకు చేరింది. దీంతో అతడికి స్టాక్ మార్కెట్ పై మరింత ఆసక్తి కలిగింది. అయితే సంకర్ష్ నాడూ చదువును నెగ్లెక్ట్ చేయలేదు.

23 year old youth makes 100 crore net worth.. know how..!!

2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఆలోచనలు ఎప్పుడు స్టాక్ మార్కెట్ పైనే ఉండేసరికి చదువుకి స్వస్తి పలికి.. స్టాక్‌లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ‘సావర్ట్’ అనే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందుకు గానూ తాను స్టాక్ మార్కెట్ లో మొదటగా ఆర్జించిన 8 లక్షల షేర్లను విక్రయించాడు. దీని ద్వారా సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడి పెట్టాడు. ఇలా అనతి కాలం లోనే భారీ లాభాలను ఆర్జించాడు.

23 year old youth makes 100 crore net worth.. know how..!!

ఇప్పుడు తన మొత్తం ఆస్తుల విలువ రూ. 100 కోట్లు. 14 ఏళ్ల వయసులో ‘ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్’ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త ‘బెంజిమన్ గ్రాహం’ కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద తనకు ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని సంకర్ష్ చందా తెలిపాడు. ప్రస్తుతం సావర్ట్ కంపెనీ 30 దేశాలకు చెందిన క్లయింట్‌లతో పని చేస్తుంది.

23 year old youth makes 100 crore net worth.. know how..!!

సావర్ట్ యాప్ ద్వారా సావర్ట్ సేవలను కూడా యాక్సెస్ చేయవచ్చు . యాప్ ఆండ్రాయిడ్ మరియు ios రెండింటికీ అలాగే వెబ్‌లో అందుబాటులో ఉంది. సవార్ట్ కంపెనీ ని ప్రారంభించేందుకు ముందు సంకర్ష్ విభిన్న ఆర్థిక స్థితులకు చెందిన ఎందరినో కలిసి ఇంటర్వ్యూ చేసాడు. అతడి కంపెనీ విజయానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో ఇంతటి విజయాన్ని పొందడం సంకర్ష్ కృషికి, పట్టుదలకు నిదర్శనం.


End of Article

You may also like