Ads
నేటి తరం ఎదుర్కొనే సమస్య అధిక బరువు. సాధారణంగా ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడాన్ని ఓవర్ వెయిట్ లేదా ఒబిసిటీ అని అంటారు. ఇప్పుడు బరువు పెరగడం అనేది సర్వసాధారణంగా మారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయులు సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దీనికి ముఖ్యమైన కారణం మన జీవనశైలి అని చెప్పవచ్చు.
Video Advertisement
జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం అధిక బరువుకి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. బరువు తగ్గడానికి అనేక వ్యాయామాలు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
అంతేకాదండోయ్ మానసిక రుగ్మతలు, మెడికల్ కండిషన్, హార్మోన్లు సక్రమంగా పని చేయకపోవడం వలన బరువు పెరుగుతూ ఉంటారు. ఇదంతా ఒక కోణం అయితే… కొందరు ఎంత ఎక్కువగా తిన్నా బరువు పెరగకుండా ఆరోగ్యంగా పిట్ గా ఉంటారు. అది వాళ్ళ జీవనశైలి కావచ్చు. ఎంత ఎక్కువగా తిన్నా వాళ్లు తీసుకునే ఆహారంలోని పోషక విలువలు మంచిగా ఉండటం కావచ్చు. 2019లో కేంబ్రిడ్జ్ అధ్యయనం ప్రకారం 100లో 33 మంది అధిక బరువుతో బాధపడుతున్నారని వెల్లడయింది. ఈ అధ్యయనం ప్రకారం సాధారణ బరువు ఉన్న వాళ్ళ కన్నా అధిక బరువు ఉన్న వారికి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు అని తెలియజేసింది. అధిక బరువు ఉన్నవారు తన జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే ప్రాణానికి ముప్పు వాటిల్లినట్లే అని వెల్లడించింది. ఈ విషయం ఇలా ఉండగా, ఎంత ఎక్కువగా ఆహారం తీసుకున్నా కొందరు ఫిట్ గా ఉండటానికి గల ఆ నాలుగు కారణాలు ఏంటో తెలుసుకుందాం…
1. మీకు మానసికంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి :
కొందరు ఆకలి వేసింది కదా అని టైం లో పడితే ఆ టైం లో అతిగా తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం పెద్ద తప్పు. ఇలా అతిగా తినడం అధిక బరువుకు దారితీస్తుంది. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల జీవనశైలి సక్రమంగా ఉండి, బరువు పెరగకుండా అదుపులో ఉంటుంది.
2. సరైన నిద్ర :
బరువు అధికంగా పెరగకుండా ఉండాలంటే కంటినిండా నిద్ర చాలా అవసరం. ఒక రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోవాలి. నిద్రలేమి అనేది అనేక రోగాలకు దారి తీస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. నిద్రలేమి అనేది శరీరంలో గ్రెలిన్ హార్మోన్స్ను విడుదల చేసి అధికంగా ఆహారం తీసుకోవాలి అనే ప్రేరణ కల్పించి ఊబకాయానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం శరీరానికి సరిపడినంత నిద్రపోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. ఎక్కువగా నిద్రపోనీ వారిలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడతాయి. యుక్తవయసులో రాత్రులు ఎక్కువగా నిద్ర లేకుండా గడపడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలన్నీ అధిగమించాలి అంటే కంటికి సరైన నిద్ర అవసరం. ఎప్పుడైతే సక్రమంగా నిద్రపోతారో వారి జీవనశైలి అదుపులో ఉండి అధిక బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోగలరు.
3. హార్మోన్స్ అసమతుల్యత :
శరీరానికి సరిపడా వ్యాయామం లేకుండా మానవ జీవనశైలి సక్రమంగా ఉండదో, శరీరం హార్మోన్ల అసమతుల్యతకు లోనవుతుంది. మన శరీరంలో ఆకలి నియంత్రించే రెండు హార్మోన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అవి గ్రెలిన్ మరియు లెప్టిన్. గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ ఆహారం తినాలని ప్రేరణ కల్పిస్తుంది. లెప్టిన్ హార్మోన్ ఆహారం ఎక్కువగా తినాలనే కోరికను నియంత్రణలో ఉంచుతుంది. ఎప్పుడైతే మనం సరైన జీవనశైలిని పాటిస్తామో రెండు హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. మన బరువుని అదుపులో ఉంచుతాయి.
4. మంచి ఆహారపు అలవాట్లు :
శరీరానికి నిర్దిష్ట శక్తి కావాలి అంటే మన ఆహార అలవాట్లు మనం అంచనా వేసుకోవడం నేర్చుకోవాలి. ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. శరీరానికి మంచి పోషకాలు అప్పుడే మన శరీర బరువు అదుపులో ఉంటుంది. ఒక రోజుకి 1600 క్యాలరీల నుండి 1800 క్యాలరీల వరకు ఒక సాధారణ మనిషికి అవసరం. మనం తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్, ఫైబర్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయో మన బరువు అదుపులో ఉంటుంది.
End of Article