Ads
చెడు అలవాట్లు అంటే.. కేవలం మందు తాగడం, సిగరెట్లు కాల్చడం మాత్రమే కాదు. ఇవి కాకుండా మనకి ఉన్న మరికొన్ని అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి. మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ అలవాటుని అయినా మార్చుకోవడం మంచిది. కొన్ని అలవాట్లు చెడ్డవి అన్న సంగతి కూడా మనకు తెలియదు. మనకు తెలియకుండానే, మన ఆరోగ్యానికి హాని కలిగించే ఆ అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
# పర్స్ ను బ్యాక్ జేబులో పెట్టుకోవడం :
ఇది చాలా మంది చేసేదే కదా.. ఇదేమి చెడు అలవాటు అనుకుంటున్నారా..? పర్స్ వెనకపెట్టుకుని నడవడం వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ.. అలానే బ్యాక్ జేబు లో పర్స్ పెట్టుకుని కూర్చోవడం వలన.. మీ వెన్నెముక కచ్చితం గా బెండ్ అవ్వాల్సి వస్తుంది. దీనివలన మీ వెన్నెముక వంగిపోయే అవకాశం ఉంటుంది. చాల మంది లో సియాటిక్ నెర్వ్ పెయిన్ రావడానికి ఇది కూడా ఒక కారణం. ఫలితం గా భవిష్యత్ లో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అలవాటును మార్చుకోవాలి. మీరు చైర్ లో కూర్చుని వర్క్ చేస్కుంటున్నపుడు, క్లాస్ వినేటపుడు, డ్రైవింగ్ చేస్తున్నపుడు పర్స్ ను మీ వెనుక జేబులో ఉంచుకోవద్దు.
# తుమ్మును ఆపుకోవడం:
సాధారణం గా ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఉన్న సమయం లోనో.. లేదా పక్కన మరెవరైనా ఉన్నప్పుడో.. మనలో చాలామంది తుమ్మును ఆపుకుంటారు. ఇది చిన్న విషయమే కావచ్చు.. కానీ దీనివలన వచ్చే ఇబ్బంది పెద్దది. సాధారణం గా మనం తుమ్మినప్పుడు మన నోరు లేదా ముక్కు నుంచి గంటకు 160 కి.మీ. వేగం తో గాలి బయటకు వస్తుంది. మనం తుమ్మును ఆపడం వలన ఈ గాలి చెవులవైపు గా వెళ్లి కర్ణభేరి ని దెబ్బతీస్తుంది. కొన్ని సార్లు కళ్ళు, మెదడు లోని రక్తనాళాలు పగిలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు తుమ్మును ఆపుకోకండి.
# చీకట్లో మొబైల్ ను వాడడం:
మనలో చాలా మంది చేసే పని నిద్రపోయే ముందు ఫోన్ వాడడం. మొబైల్ నుండి వెలువడే కాంతి వలన అనేక కంటి సమస్యలు ఎదురవుతాయి. కంటి చూపు మందగించడం, తాత్కాలిక అంధత్వం, కంటికింద మచ్చలు రావడం, ఇన్సొమ్నియా ( నిద్రలేమి) వంటి పరిస్థితులు ఎదురవుతాయి.
# షుగర్ ఎక్కువ తినడం:
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరు…? కానీ.. స్వీట్స్ ఎక్కువ మోతాదు లో తీసుకోవడం వలన వయసు పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరం లోని ప్రతి అవయవం పైనా ఈ ప్రభావం ఉండొచ్చు. ఎక్కువ కాలరీస్ తీసుకోవడం వలన బరువు పెరిగి ఇబ్బంది పడతారు. డయాబెటిస్, లివర్ ప్రాబ్లమ్స్, పాంక్రియాటిక్ కాన్సర్ వంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
# జీన్స్ వేసుకోవడం:
మనలో జీన్స్ వేసుకోవడం అనేది చాలా కామనే. కానీ, జీన్స్ వేసుకోవడం వలన టైట్ నెస్ ఎక్కువ గా ఉండి లివర్ పై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణాశయం సరిగ్గా పనిచేయకపోవడం, కాళ్లల్లో సరిగా రక్త ప్రసరణ జరగకుండా గడ్డ కట్టిపోవడం, ఎక్కువ గా టాయిలెట్ కి వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
# యూరిన్ ఆపుకోవడం :
యూరిన్ రావడం అనేది శరీరం లో సహజం గా జరిగే ప్రక్రియ. దీనిని మనం ఆపడం వలన అనేక ఇబ్బందులొస్తాయి. యూరిన్ లో ఉండే బాక్టీరియా కారణం గా యూరిన్ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ ఇన్ఫెక్షన్ క్రమం గా కిడ్నీలకు వ్యాపిస్తుంది. ఫలితం గా కిడ్నీలలో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
# బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం:
సమయం సరిపోకో, లేదా సన్నగా అవడం కోసం డైటింగ్ చేసేవారో బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు. దీనివలన ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే రోజంతా ఏ పని పైనా కాన్సన్ ట్రేట్ చేయలేరు. అంతే కాదు బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో 27 శాతం మందికి ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుందట. మహిళల్లో అయితే.. రుతుక్రమం లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందట.
End of Article