ఈ 8 గుర్తులు మీలో గుర్తించారా? అయితే మీరు జీనియస్ కిందే లెక్క.. అవేంటో చూడండి..!

ఈ 8 గుర్తులు మీలో గుర్తించారా? అయితే మీరు జీనియస్ కిందే లెక్క.. అవేంటో చూడండి..!

by Anudeep

Ads

అసలు జీనియస్ అంటే ఏంటి..? వందకి వంద మార్కులు వచ్చేస్తే వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ అని మీరు అనుకుంటున్నారా. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, టాలెంట్, తెలివి తేటలు ఇవన్నీ మార్కులను బట్టి ఉండవు. మనకు వచ్చే సిట్యుయేషన్స్ ను మనం డీల్ చేసే విధానాన్ని బట్టి మన తెలివి తేటలు ఆధారపడి ఉంటాయి. మరి, మనం జీనియస్ ఏనా కాదా అన్న సంగతి ఎలా తెలుస్తుంది..? ఈ కింద పాయింట్స్ చదవండి. ఈ పది అలవాట్లు మీకు ఉన్నాయో లేవో తెలుసుకోండి.

Video Advertisement

staying late

1. రాత్రిళ్ళు ఎక్కువ సేపు మెలకువ గా ఉండడం:
మనలో చాలామంది నిద్ర పట్టడం లేదు అంటూ ఉంటారు. మధ్యాహ్నం నిద్రపోయిన వారి సంగతి పక్కన పెడితే, రాత్రుళ్ళు నిద్రపట్టక ఎదో ఆలోచిస్తూ ఉంటున్నారా..? అయితే మీరు జీనియస్ కిందే లెక్క. ఎందుకంటే జీనియస్ ల మెదడు నిరంతరం ఆలోచిస్తూనో.. ఏదో ఒక పని చేస్తూనో ఉంటుంది. అందుకే రాత్రిళ్ళు వీరికి తొందరగా నిద్రపట్టదు. అయితే మెదడు మెలకువ గా ఉన్న ఆ సమయాన్ని సినిమాలు చూస్తూ వృధా చేసుకోవడం కంటే.. ఏదైనా జ్ఞానాన్ని పెంచే వీడియోస్ చూడడం లేదా బుక్స్ చదవడం మంచిది. లియోనార్డో డావిన్సి, నికోలా టెస్లా వంటి వారు కూడా రోజుకు రెండు నుంచి మూడు గంటలు పడుకునేవారట. అంతకుమించి వారికి నిద్ర పట్టేది కాదట.

2. బద్ధకం:
బద్ధకం అంటే పనులను మానేయడం మాత్రమే కాదు.. వాటిని రొటీన్ గా కంటే డిఫరెంట్ గా తొందరగా అయిపోయేలా చేసేయడం. ఎక్కువ సేపు, ఎక్కువ ప్రాసెస్ ఉండే పనుల్ని వీరు చేయడానికి బద్దకించి వాటిని తొందరగా పూర్తి చేసే స్మార్ట్ వర్క్ ను అలవాటు చేసుకుంటారు. సో కొన్ని సార్లు బద్ధకం కూడా టైం ని సేవ్ చేస్తుందన్నమాట. అలా బద్ధకం ఉండబట్టే కదా ఇప్పుడు మనం చేయాల్సిన పనులకి టెక్నాలజీ రూపం లో అనేక ఆల్టర్నేటివ్స్ దొరికాయి.

less social

3. జనాలతో తక్కువ కలవడం:
మీకు సోషల్ లైఫ్ అంత గా ఇష్టం ఉండదా? అయితే మీరు కూడా జీనియస్ నే. ఎందుకంటే పబ్లిక్ గేదరింగ్స్ ను ఇంటెలిజెంట్ బ్రైన్స్ ఎక్కువ గా ఇష్టపడవు. ఇంటెలిజెంట్ మెదడు ఉన్నవారు ఒంటరిగా కూర్చుని ఆలోచనలు చేయడాన్ని ఇష్టపడతారు. వీరు చాలా తక్కువ మాట్లాడతారు. కానీ, వీరు మాట్లాడిన మాటలు కొన్ని వేలమందిని ఆలోచింప చేసేవిధం గా ఉంటాయి.

4. నిద్రపోయేముందు ఎక్కువ ఆలోచిస్తున్నారా..?
నిద్రపోయేముందు ఎక్కువ సేపు ఆలోచించే అలవాటు ఉన్నవారు కూడా జీనియస్ లే. ఎందుకంటే, జీనియస్ బ్రెయిన్ ఎల్లప్పుడూ ప్రతి విషయాన్నీ కూలంకుషం గా ఆలోచించి పని చేస్తుంది. తద్వారా జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని, జరగబోయేవాటిని సమర్ధవంతం గా ఎదుర్కొంటుంది.

addiction

5. దేనికైనా అడిక్ట్ అయిపోయారా?
ఏదైనా పని చేయడం లేదా పేపర్ చదవడం వంటి ఏదైనా పని కి మీరు బాగా అడిక్ట్ అయిపోయారా..? దానికి కారణం ఏంటంటే మెదడు లో రిలీజ్ అయ్యే డోపామైన్. ఇది ఏదైనా పని పట్ల, వ్యక్తి పట్ల, హాబీ ల పట్ల ఇష్టం కలిగేలా చేస్తుంది. జీనియస్ లకు వారి అడిక్షన్ కి కారణం వారి మెదడు లో రిలీజ్ అయ్యే డోపమైనే.

6. మీలో మీరే మాట్లాడుకోవడం:
జీనియస్ లు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. కొన్ని సార్లు వారిలో వారే మాట్లాడేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం వారి మెదడు నిత్యం ఆలోచిస్తూనే ఉంటుంది. వీరు ప్రతి చిన్నవిషయాన్ని భిన్నం గా గమనిస్తూ ఉంటాడు. అందుకే తనలో తానె చర్చించుకుంటాడు. అందుకే వీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు.

blue eyes

7. బ్లూ ఐస్:
ఈ ప్రపంచం లో మొత్తం 787 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 8 శాతం మందికి మాత్రమే బ్లూ ఐస్ ఉన్నాయి. ఓ సర్వే ప్రకారం వీరి మెదడు ఎంతో ఉన్నతం గా ఆలోచించగలదట.

nail sign 1

8. మీ గోర్లపై ఇలా ఉందా..?
మీ గోర్లపై వైట్ సైన్ ఉందా..? ఇలా చాలా మందికి ఉంటుంది. అయితే, ఎవరికి అయితే ఎక్కువ గా ఉంటుందో.. వారు అంత ఎక్కువ లాజికల్ గా ఆలోచించగలుగుతారట. బ్లూ ఐస్ లాగ… ఈ లక్షణం కూడా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది.

సో, ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా..? కంగ్రాట్యులేషన్స్. మీరు కూడా జీనియస్ లే. అయితే.. ఏ అలవాటుని అయినా మనం ఎలా ఉపయోగించుకున్నామన్న దానిపై మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది.


End of Article

You may also like