Ads
రోజు బయట తిరిగి రావడం వేరు.. ఎపుడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి చూసి రావడం వేరు. అదో అనిర్వచనీయమైన అనుభూతి. ట్రావెలింగ్ వలన మనలో చాలా ప్రశాంతత వస్తుంది. కొత్త రకమైన ఉత్తేజం తో మనం పని చేయగలుగుతాం.
Video Advertisement
ప్రపంచ వ్యాప్తం గా ఉండే విశేషాలను తెలుసుకోవడం వలన కూడా మనకు కొత్త ఉత్సాహం, తపన లభిస్తూ ఉంటుంది.
కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు మనం కొత్త కొత్త పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉంటాం.. ఒక్కో దేశం లోను ఒక్కో చోట ఉండే రూల్స్ ని తెలుసుకుంటూ ఒక్కోసారి షాక్ అవుతూ ఉంటాం కూడా.. అక్కడ దొరికే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం.. అలాగే అక్కడ ఉండే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు లేదా చట్టాలు కావచ్చు.. ఏవైనా మనకి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. అలా.. ప్రపంచవ్యాప్తం గా తొమ్మిది వింత చట్టాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
#1 కెనడా లో రేడియో స్టేషన్లు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య దాదాపు 35 శాతం సమయం వరకు కెనడియన్ ఆర్టిస్ట్ ల సాంగ్స్ మాత్రమే ప్లే చేస్తాయి.
#2 ఫ్రాన్స్ లో మీరు నివసించే నగరం లో ఖననం చేసుకోవడానికి రిజర్వ్ చేసుకోకపోతే.. మీరు నగర పరిధిలో మరణించడం చట్ట విరుద్ధం కింద వస్తుందట.
#3 2008 నుండి జర్మనీలో లేస్ తో చేసిన లోదుస్తులను ధరించడం పై నిషేధం విధించారట.
#4 2500 సంవత్సరాల పురాతన శిధిలాలను కాపాడటానికి గ్రీస్‌లోని అక్రోపోలిస్‌పై హై హీల్స్ నిషేధించారట.
#5 వెనిస్లో మీరు పావురాలకు ఆహరం వేస్తే.. మీకు 700 యూరోల వరకు ఫైన్ వేస్తారట. నగరాన్ని శుభ్రం గా ఉంచడం అక్కడ ప్రజల బాధ్యతేనట.
#6 స్పెయిన్‌లో, మీరు ఇసుక కోటలను కడితే.. 100 నుండి 1,500 యూరోల వరకు ఫైన్ ను వేస్తారట.
#7 సమోవాలో, మీ భార్య పుట్టినరోజును మరిచిపోతే శిక్షను విధిస్తారట.
#8 పోలాండ్లోని పాఠశాలల్లో విన్నీ ది ఫూ ని అనుమతించారట. ప్యాంటు లేకపోతే పాఠశాలలోకి అనుమతి ఉండదట.
#9 పశ్చిమ ఆస్ట్రేలియాలో, మీరు ఒకేసారి 110 పౌండ్ల బంగాళాదుంపల కంటే ఎక్కువ తినకూడదట.
అదండీ సంగతి..! ఈ చట్టాలు అన్ని చాలా విచిత్రం గా ఉన్నాయి కదా.. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినపుడు.. ఇలాంటి విచిత్రమైన రూల్స్ ని ఎప్పుడైనా ఫేస్ చేసారా..? చేస్తే, ఆ రూల్స్ గురించి కామెంట్స్ లో షేర్ చేయండి.
End of Article