కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 2 వ వారంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం..! ఎక్కడంటే..?

కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 2 వ వారంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం..! ఎక్కడంటే..?

by Anudeep

Ads

కార్తీక మాసం.. ఈ పేరు వినగానే మనసులో ఆధ్యాత్మిక భావన ఉప్పొంగుతుంది. ఈ మాసంలో అందరు ఉపవాసాలు ఉంటూ, మాంసాహారానికి దూరంగా ఉంటూ.. విశేషంగా పూజలు జరుపుతూ ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతూ ఉంటారు. శివునికి ఎంతో ఇష్టమైన కార్తీకమాసానికి హిందూ సంప్రదాయంలో చాలానే ప్రత్యేకత ఉంది.

Video Advertisement

koti deepotsavam 1

కార్తీక మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది దీపారాధన. ఈ మాసం లో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీపారాధన మనలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది అని పురాణాలలో కూడా చెప్పబడింది. అందులోను.. కార్తీకమాసంలో దీపారాధనకు మరింత ప్రాధాన్యత ఉంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు అంత నూనెతో దీపారాధన చేసి, చెంబుడు నీళ్లు పోస్తే పరమ సంతృప్తి చెంది తన భక్తులని ఎల్లవేళలా కాపాడతాడు.

koti deepotsavam 2

ఈ సమయంలో దీపారాధనకు ఇంత ప్రాముఖ్యత ఉండబట్టే దీపోత్సవాలకు ఆదరణ లభిస్తోంది. అందుకే.. కోటి దీప కాంతులతో ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే అందరికి మంచి జరుగుతుంది అనే సదుద్దేశ్యంతో కోటి దీపోత్సవాన్ని నరేంద్ర చౌదరిగారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ దీపోత్సవానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. అందుకే ఈ ఏడాది నవంబర్ న‌వంబ‌ర్ 12 వ తారీఖు నుండి 22 వ తారీఖు వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవాన్ని హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసారు.


End of Article

You may also like