తిరుమల గురించి బ్రహ్మం గారు చెప్పిన ఈ విషయం నిజం అయ్యింది అనుకుంట..?

తిరుమల గురించి బ్రహ్మం గారు చెప్పిన ఈ విషయం నిజం అయ్యింది అనుకుంట..?

by Anudeep

Ads

భారతీయులు ఎక్కువ గా జ్యోతిష్య శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణం గా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు. అయితే, మన పూర్వికులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు.

Video Advertisement

వాటిలో “బ్రహ్మం గారి కాల జ్ఞానం” ఎక్కువ ప్రాచుర్యం పొందింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానం తో భవిష్యత్ లో ఏమి జరగబోతోందో ముందే చెప్పారు.

veerabrahmam 1

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి,హేతువాది, సంఘ సంస్కర్త . బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్ లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి చెప్పారు .వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి . వాటిల్లో ఒకటి తిరుమల గురించి కూడా ఉంది.

veerabrahmam 2

తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు ముందే చెప్పారు. భారీ వరదకు తిరుమల పరిసరాలన్నీ రూపు రేఖలు మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏ దారిలోనూ తిరుమలకు వెళ్లే పరిస్థితి లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వరద ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.

veerabrahmam 3

నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల వద్ద కురిసిన భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శేషాచలం కొండల వద్ద డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వరద కారణంగా తిరుమలలో రూ 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని బ్రహ్మంగారు ముందే చెప్పారు. అంతే కాదు.. ఆయనలు పలు ఇతర విషయాల గురించి కూడా వెల్లడించారు.

veerabrahmam 4

వెంకటేశ్వర స్వామి వారి సంపదని ఆరుగురు దోచుకుంటారని, శ్రీశైల మల్లిఖార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, కృష్ణా నది మధ్యలో బయటపడ్డ బంగారు రధాన్ని చూసిన వారు కళ్ళు పోగొట్టుకుంటారని, మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయదుర్గం లో చిలుక వీర ధర్మాలను చెబుతుందని, బనగానపల్లి లో పాతరమీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లిఖార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. ఇప్పటికే ఆయన చెప్పినవి కొన్ని నిజమవ్వడంతో.. ఆయన కాలజ్ఞానానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది.

 


End of Article

You may also like