ఆఫీస్ లో పని వదిలేసి ఫోన్ లో కొడుకుని చూసుకుంటోంది.. నా ఇబ్బందిని తనతో చెప్పేదెలా..?

ఆఫీస్ లో పని వదిలేసి ఫోన్ లో కొడుకుని చూసుకుంటోంది.. నా ఇబ్బందిని తనతో చెప్పేదెలా..?

by Anudeep

Ads

ఉద్యోగంలో ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సమయంలోనే మనం మన సహోద్యోగులతో ఎక్కువ చనువుగా ఉంటాము. పనిని పంచుకుంటూ చేస్తాము. సహోద్యోగుల మధ్య బంధం బాగుంటే.. ఎంత పనిని అయినా సునాయాసం గా చేయగలుగుతాము.

Video Advertisement

కానీ.. సహోద్యోగుల వల్ల ఇబ్బంది తలెత్తితే ఏమి చేయాలి..? ఇదే పరిస్థితి ఎదురవడంతో.. తనకు సలహా ఇవ్వాలంటూ ఓ వ్యక్తి మెసేజ్ చేశారు. అతని పరిస్థితి తెలుసుకుని.. మీకు తోచిన సలహా ఇవ్వండి.

colleague 1

“నేను పని చేసే ఆఫీసులో.. నాతో పాటే పని చేసే మహిళా ఉద్యోగి గత కొన్ని రోజులుగా ప్రసూతి సెలవలు తీసుకుంది. ఈ మధ్యే ఆమె సెలవు పూర్తి చేసుకుని ఆఫీస్ కి తిరిగి వచ్చింది. ఆమె మొదటి సారిగా తల్లి అయ్యింది. ఆ బిడ్డను ఇంట్లోనే ఉండి చూసుకోవడానికి వీలు లేకపోవడంతో.. ఓ కేర్ టేకర్ ను కూడా నియమించుకుంది.

colleague 2

కానీ.. తెలియని వాళ్ల చేతిలో బిడ్డని వదిలిరావడానికి ఆమె భయపడుతోంది. ఈ కారణం తో ఆమె ఇంట్లోనే సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంది. వాటిని ఆఫీస్ లోనే కూర్చుని తన మొబైల్ లో పర్యవేక్షిస్తూ ఉంటుంది. మా ఇద్దరివీ పక్క పక్క సీట్లు కావడంతో నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది.

colleague 3

ఆమె ఎప్పుడు ఫోన్ లో తన కొడుకుని చూసుకుంటూ పరధ్యానంగా ఉండిపోతుంది. పని మీద ఆమెకు శ్రద్ధ లేదేమో అనిపిస్తోంది. ఆమె చేయాల్సిన పని భారాన్ని కూడా నేనే మోయాల్సి వస్తోంది. మేము ఇద్దరమూ ఒక అధికారి కిందే పని చేస్తూ ఉంటాము. ఈ విషయం గురించి నేను ఆయనకు ఫిర్యాదు చేయాలా? లేక ఆమెతోనే చర్చించి పరిష్కరించుకోవాలా..? అన్నది తెలియడం లేదు. మీకు తోచిన సలహా ఇవ్వగలరు..


End of Article

You may also like