Ads
రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న టైం లో కుక్కలు వెంటపడితే ఎవరికైనా భయం వేయడం సహజం. ఎంతగా పెట్స్ ని పెంచుకునే అలవాటు ఉన్నవారికి అయినా రోడ్డుపై తిరిగి స్ట్రీట్ డాగ్స్ ని చూస్తే సహజంగానే భయం వేస్తుంది. జనావాసం లేని చోట కుక్కలు మరింతగా రెచ్చిపోతుంటాయి.
Video Advertisement
ఇలాంటి సందర్భాలలో ఏమి చెయ్యాలి..? వాటిని చూడగానే వాటి దిశని మార్చే ప్రయత్నం ఏదైనా చెయ్యాలి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం.
#1. కుక్కలు వెంటపడితే ముందు కంగారు పడి భయపడకండి. మీరు భయపడినట్లు కనిపిస్తే.. అవి ఇంకా బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ముందు ధైర్యంగా ఉండండి. మీరు భయపడితే.. అవి మరింతగా భయపెట్టి, మీదకెక్కి కురవాలని చూస్తాయి.
కుక్కలు వెంటపడుతున్నాయని తెలియగానే పరిగెత్తమాకండి. మీరు పారిపోతున్నారని అవి ఏమాత్రం పసిగట్టిన ఇంక మీ సంగతి అంతే. మీరు ధైర్యంగా ఆగి.. వాటికి ఎదురుగా నిలబడండి. ఎప్పుడైతే మీరు పారిపోవట్లేదో.. అప్పుడు అవి కొంచం భయపడతాయి.
#2. అయితే కుక్కకి ఎదురుగా నుంచుని కళ్ళలోకి కళ్లు పెట్టి చూడద్దు. అలా చూస్తే అవి మరింతగా ముందుకొచ్చి, మీదకి దూకడానికి ప్రయత్నిస్తాయి. అవి మిమ్మల్ని కరవడానికి ప్రయత్నిస్తాయి.
#3. కుక్క దృష్టి మార్చే ప్రయత్నం చేయండి. ఏదైనా వస్తువుని దూరంగా విసిరేయండి. అప్పుడు ఆ కుక్క అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వాటి దృష్టి మరల్చడానికి ఏమైనా ప్రయత్నించండి.
#4. కుక్కలు వెంటపడుతుంటే పారిపోకుండా.. తిరిగి అరవడానికి ప్రయత్నించండి. అరవడం ద్వారా వాటిని భయపెట్టడానికి ప్రయత్నించండి. మీ అరుపుకి అవి కొంత భయపడతాయి.
End of Article