Ads
ఒకప్పుడు ముప్పయేళ్ల వయసు అంటే మిడి వయసు. అనుభవం, శక్తి అన్ని కలగలిసి చురుకుగా ఉండే వయసు. కానీ.. నేటి పరుగుల జీవితాల్లో ముప్పయేళ్ల వయసు అంటే ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటోంది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు మరో వైపు కుటుంబ బాధ్యతలతో సతమతం అయ్యే వయసు ఇది.
Video Advertisement
ఈ వయసులో కచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆరోగ్యం బాగుండాలంటే.. అది మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుంది.
అందుకే ముప్పయ్యేళ్ల వయసు దాటిన వారు ఈ ఆహార పదార్ధాలను కచ్చితంగా తీసుకోండి. ఈ వయసులో మధుమేహం, బిపి, షుగర్ వంటి వాటికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటి బారిన పడకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏంటో తెలుసుకోండి.
మెంతులు:
మెంతులను డైరెక్ట్ గా తినలేము. అందుకే ఏదో ఒక రూపంలో వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. తద్వారా పక్షపాతం, కాన్సర్, మధుమేహం వంటి వాటి బారిన పడకుండా ఉంటారు.
చియా సీడ్స్:
చియా సీడ్స్ లో ఎన్నో పోషక పదార్ధాలు ఉంటాయి. ముప్పై దాటిన వారందరు చియా సీడ్స్ ను తీసుకోవడం ద్వారా బరువుని అదుపులో ఉంచుకోగలుగుతారు. అలాగే.. జీర్ణ క్రియ సమస్యలని కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు.
అశ్వగంధ పొడి:
ముప్పై ఏళ్ళు దాటిన వారిలో పురుషులైనా.. స్త్రీలైనా లైంగిక సామర్ధ్యం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే వేడి పాలల్లో ఒక అర టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలుపుకుని తాగాలి. రోజు పడుకునే ముందు ఇలా తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఫ్రూట్స్ :
సీజనల్ ఫ్రూట్స్ తో పాటు అవకాడో, ఖర్జురాలు, గుమ్మడి గింజలు, అత్తిపండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
డ్రై ఫ్రూట్స్:
బాదాం , వాల్ నట్స్ ని కూడా డైట్ లో చేర్చుకోండి. వీటి ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్, అవిసె గింజలు, ఆకుకూరలు, వెల్లుల్లి వంటి వాటిని కూడా ఆహరంలో చేర్చుకోండి.
End of Article