నరదృష్టి సోకితే నాపరాయి అని పగలాల్సిందే అంటుంటారు. అంతటి పవర్ ఉంటుంది. అందుకే నారా దృష్టి సోకితే శారీరకంగా బలహీన పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా ఈ నరదృష్టికి దూరం గా ఉండవచ్చు.
అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి సింహద్వారం వద్ద గుమ్మడి కాయను కట్టడం ద్వారా చెడు దృష్టి పడకుండా చూసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ప్రతి నెలలో.. ఆదివారం లేదా గురువారం రోజున బంగాళాదుంపను ఉడకపెట్టి మధ్యాహ్నం 1:00 టైములో ఆవుకు పెట్టాలి. ఆ సమయంలో ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఈ పనిని పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా చేయవచ్చు. అలాగే పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఇంటికి దిష్టి తీసి.. నిమ్మకాయని కోసి గుమ్మానికి చెరువైపులా పెట్టాలి. అలాగే గుమ్మడికాయతో దిష్టి తీస్తే.. ఇంటికి నరదృష్టి సోకకుండా ఉంటుంది.

