బెడ్ రూమ్ పనులే పబ్లిక్ అవుతున్నాయి..అందుకే కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణుక్యుడు..!

బెడ్ రూమ్ పనులే పబ్లిక్ అవుతున్నాయి..అందుకే కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణుక్యుడు..!

by Anudeep

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

Video Advertisement

ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.

chanakya says

ఆయన చెప్పే విషయాలు నేటికీ ఆచరణీయమైనవి. ఎటువంటి కాలంలో అయినా సమాజంలో మనిషి మనుగడకు ఆయన వాక్యాలు దోహదం చేస్తాయి. పడకగది విషయాలు కూడా బహిరంగం అయిపోతున్న ఈ రోజుల్లో.. కాకి, కొంగ, సింహం వంటి పశుపక్ష్యాదుల నుంచి చాలా విషయాలను నేర్చుకుని ఆచరించాలని చాణుక్యుడు చెప్పాడు. దేని నుంచి ఏ ఏ విషయాలను నేర్చుకోవాలో చాణుక్యుడు ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం..

సింహం:

Lion
సింహం ఏ పని చేసినా.. తన శక్తిని పూర్తిగా వినియోగిస్తుంది. తన శక్తిని అంచనా వేసుకుని.. పూర్తి నిబద్ధతతో చేస్తుంది. ఈ విషయాన్నే మనం సింహం నుంచి నేర్చుకోవాలి.

కోడిపుంజు:

Kodipunju
కోడిపుంజు ఉదయాన్నే వేళకి నిద్ర లేస్తుంది. ఎల్లవేళలా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా అది యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది. తనకి రావాల్సిన ఆహారాన్ని పోట్లాడి మరీ తీసుకోవడంలో కోడిపుంజు ముందుంటుంది. ఈ నాలుగు విషయాలను మనం కోడిపుంజు నుంచి నేర్చుకోవాలి.

కాకి:

crow
కాకి కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే.. కాకులు ఎప్పుడూ సంభోగం చెందుతాయో ఎవ్వరికీ తెలియదు. ఎవరు లేని, ఎవరు చూడని సమయంలోనే అవి సంభోగం చెందుతాయి. పడకగది విషయాలు కూడా బహిర్గతం అయిపోతున్న ఈరోజుల్లో.. ప్రతి ఒక్కరు కాకి వద్ద నుంచి ఈ విషయాన్నీ నేర్చుకోవాలి. ఇవి ఒకసారి భాగస్వామిని ఎంచుకున్నాయంటే.. జీవితాంతం మార్చవు. అదే భాగస్వామితో జీవితాన్ని గడుపుతాయి. ఇక ఇతరుల కార్యకలాపాల్ని కూడా ఇవి నిశితంగా గమనిస్తాయి. ఇంకా సమయాన్ని బట్టి.. సందర్భాన్ని బట్టి ఇవి తెలివిగా వ్యవహరిస్తాయి. ఈ ఐదు విషయాలను మనం కాకుల నుంచి నేర్చుకోవాలి.

గాడిద:

gadida
గాడిద తన పై ఎంత బరువు పెట్టినా.. అలసిపోకుండా.. పని ఆపకుండా పూర్తి చేస్తుంది. వాతావరణంలో ఎంత వేడి ఉన్నా.. ఎంత చల్లదనం ఉన్నా అది పట్టించుకోదు. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మూడవ విషయం ఏంటంటే.. ఏది పెట్టినా సంతృప్తి చెందుతుంది. ఈ విషయాలని గాడిద నుంచి నేర్చుకోవాలి.

కొంగ:

konga
కొంగ నుంచి రెండు విషయాలను నేర్చుకోవాలి. వాటిలో ఒకటి ఇంద్రియ నిగ్రహం. ఇంకొకటి ఏమిటంటే స్థానం, శక్తీ, సందర్భం వంటి విషయాలలో కొంగలకు చాలా అవగాహన ఉంటుంది. ఈ విషయాలను మనం నేర్చుకోవాలి.

కుక్క:

dog
కుక్క ఏ ఆహారాన్నైనా తినగలదు. కానీ అది దానికి దొరికినదానితోనే తృప్తి పడుతుంది. ఎంత గాఢ నిద్ర లో ఉన్నా, చిన్న చప్పుడు అయితే లేచి కూర్చుంటుంది. బాధ్యతలనుంచి తప్పించుకోవాలని అనుకోదు. తన యజమాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఎల్లవేళలా ధైర్యంగా ముందుకు ఉరకడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విషయాలను మనం కుక్క నుంచి నేర్చుకోవాలి.

 


End of Article

You may also like