Ads
ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్లి కొత్త మలుపులని తీసుకొస్తుంది. అబ్బాయిల జీవితంలో కూడా పెళ్లి మార్పుని తీసుకొచ్చినా.. అమ్మాయిల జీవితంలో వచ్చే మార్పు కొంత కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబంలో అప్పటివరకు ఉన్న అలవాట్లను పక్కన పెట్టి మరో కుటుంబానికి వస్తుంది ఆడపిల్ల.
Video Advertisement
అక్కడి మనుషులకి, వాతావరణానికి అలవాటు పడడానికే చాలా సమయం పడుతుంది. ఇవి కాక అప్పటివరకు ఉన్న రక్త సంబంధం తో ఉన్న కుటుంబ సభ్యులు పక్కన ఉండరు. కొత్త పరిస్థితులకు తానే అడ్జస్ట్ అవుతూ, తనని తాను మార్చుకోవాల్సి ఉంటుంది.
ఇవికాక ఇతర కుటుంబసభ్యులను పట్టించుకోవాల్సి ఉంటుంది. దీనితో అత్తమామలు, కోడళ్ల మధ్య సహజంగానే కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ను అందరు కుటుంబసభ్యులు కలిసి ప్రేమానురాగాలతో ఫిల్ చేసుకోవాలి. అయినా సరే చాలా సార్లు కోడళ్ళు అత్తమామల్ని తల్లితండ్రులుగా ఎందుకు చూడట్లేదు..? అన్న ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. దీనికి ఓ కోరా యూజర్ ఇలా సమాధానం చెప్పారు.
కోడలి సంగతి సరే.. అత్తామామలు కోడళ్లను కూతుర్లలా చూస్తున్నారా..? చూస్తుంటే ఎంత మంది తమ అత్తా మామలతో సంతోషంగా ఉండగలుగుతున్నారు..? అంటూ ఆమె ప్రశ్నించారు. ఆ కోడలు ఉద్యోగం చేస్తుంటే.. జీతం అంతా తమకే ఇవ్వాలని.. పుట్టింటి వారికి ఇవ్వకూడదని ఆంక్షలు పెట్టేవారు ఉన్నారు. ఇక.. ఉద్యోగం చెయ్యని అమ్మాయి అయితే ఇంటి పని అంతా ఆమె చెయ్యాలని చూసేవారు కూడా ఉన్నారు.
అత్తింటివారు ఎవరైనా కోడలిని కోడలిలా.. అల్లుడిని అల్లుడిలా చూడాలి. అల్లుడిని నెత్తిన పెట్టుకున్నా.. కోడలిని మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటారు. అత్తమామల్ని ఇబ్బందులు పెడుతూ కేసులు పెట్టి హింసించే కోడళ్ల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. కానీ, నోరు మెదపకుండా కన్నీళ్లతో రోజులు గడిపే కోడళ్ళు కూడా ఉన్నారు. అత్తమామల్ని అమ్మా నాన్నల్లా చూడలేకపోవచ్చు. ఎందుకంటే.. దాదాపు 20 ఏళ్ల పైనే పెంచిన మమకారాన్ని అత్తమామలతో పోల్చలేము. తాను తన అత్తింటివారు తనని కూతురులా చూడాలని అనుకోవడం లేదని, కోడలిలా.. ఓ కుటుంబ సభ్యురాలిలా చూస్తే చాలని అనుకుంటున్నానని సదరు కోరా యూజర్ చెప్పుకొచ్చారు.
Note: Images used in this article are for reference purposes only.
End of Article