రావణుడికి ఉన్న ఈ 6 కోరికల గురించి తెలుసా..? రావణుడికి ఇలాంటి కోరికలు ఉండి ఉంటాయని అస్సలు ఊహించి ఉండరు..!

రావణుడికి ఉన్న ఈ 6 కోరికల గురించి తెలుసా..? రావణుడికి ఇలాంటి కోరికలు ఉండి ఉంటాయని అస్సలు ఊహించి ఉండరు..!

by Anudeep

Ads

రామాయణం తెలియని భారతీయులు ఉండరు. అందులో రావణుడి గురించి కూడా అందరికి తెలుసు. కానీ రావణుడు అందరికి విలన్ గానే తెలుసు. సకల ధర్మ శాస్త్రాలను ఆచరించిన రావణ బ్రహ్మ పర స్త్రీ పై మోజు పడడం కారణంగా జీవితంలో పతనం అవ్వాల్సి వచ్చింది.

Video Advertisement

ఆ ఒక్క విషయాన్నీ పక్కన పెడితే.. రావణుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. స్వతహాగా రావణుడు కూడా మంచివాడే. దైవం పై నమ్మకం కలిగిన వాడే.

ravana 1

తన రాజ్యం లో ప్రజల సుఖ సంతోషాల గురించి కోరుకునే మంచి మనస్తత్వం కలిగినవాడు. రామాయణంలో రావణుడు విలన్ గా మిగిలిపోయినప్పటికీ.. ఆయనలో కూడా కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. అలాంటి రావణుడికి ఒక ఆరు మంచి కోరికలు ఉండేవట. అవేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

#1. మద్యాన్ని అందరు ఇష్టపడతారు. అందుకే మద్యానికి ఎలాంటి వాసనా ఉండకూడదు అని రావణుడు కోరుకునేవాడట.

ravana 2

#2. అలాగే మనుషుల రక్తానికి ఎలాంటి రంగు ఉండకూడదని.. అందరు మనుషులు ఒకే రంగులో ఉండాలి అని రావణుడు కోరుకునేవారట. అలా ఉంటె.. మనుషులు అందరు సమానమే అన్న భావన వ్యక్తుల మధ్య ఉంటుందని రావణుడు భావించేవాడట.

#3. తండ్రి బతికే ఉండగా.. ఏ కుమారుడూ మరణించకూడదని.. ఎవరికీ పుత్ర శోకం ఉండకూడదని రావణుడు కోరుకునేవాడట.

#4. ఎప్పుడైనా పంటలు పడక రైతులు ఇబ్బంది పడితే.. రావణుడు ఇంద్రుడికి పూజలు చేసి వర్షాలు పడేలా చూడాలని కోరుకునేవాడట.

ravana 3

#5. రావణుడు తన దేహం బంగారు వాసన వస్తూ ఉండాలని కోరుకునేవాడట.

#6. ఇంకా భూమికి, స్వర్గానికి మధ్యన ఒక నిచ్చెన ఉంటె బాగుండేదని అనుకునేవాడట. అలా ఉంటె మనుషులు స్వర్గానికి నడుచుకుంటూ వెళ్లిపోగలరని భావించేవాడట.


End of Article

You may also like