Ads
ఫైర్ ట్రక్కులు ఎరుపు రంగులో ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలా ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయి..? అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Video Advertisement
1900లలో ప్రజలు ఎక్కువగా నలుపు-రంగు కార్లను వాడేవారు. రోడ్లలో ఎక్కువగా ఈ కార్లే కనపడేవి. అయితే.. వీటి మధ్యలోనే ఫైర్ ట్రక్స్ ని నడపాల్సి వచ్చేది. అయితే.. ఈ వాహనాలు ఎమర్జెన్సీ వల్ల వేగంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
అందుకే.. ఇవి ప్రయాణం చేసే సమయంలో ఎన్ని వాహనాలు ఉన్నా.. ఇవి ప్రత్యేకంగా కనపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వాహనాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఎరుపు రంగుని ఎంచుకున్నారు. దీనికి మరొక కోణం కూడా ఉంది. రంగుని బట్టి ఒక అస్పష్ట సందేశాన్ని అందించడం కూడా ఈ ఎరుపు రంగుని ఎంచుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం.
ఉదాహరణకు, ఆకుపచ్చ రంగు సాధారణంగా ‘ముందుకు వెళ్లండి’ని సూచిస్తుంది, తెలుపు రంగు శాంతికి సంబంధించిన రంగుగా పరిగణించబడుతుంది మరియు ఎరుపు రంగుని చాలా సందర్భాలలో హెచ్చరికను సంకేతంగా ఉపయోగిస్తారు. అంటే.. ఈ రంగు ట్రక్ ని చూడగానే రోడ్డుపై ఉండే ఇతర వాహనాలు అడ్డు తప్పుకుని ఈ ఫైర్ ఇంజిన్స్ కు దారి ఇస్తాయి. ఈ క్రమంలో అవసరమైన చోటుకు ఈ వాహనాలు త్వరితంగా వెళ్లగలుగుతాయి.
ప్రతి ఒక్కరికి చెప్పడం సాధ్యం కాదు కాబట్టే.. ఇలా రంగుని ఉపయోగించి సంకేతాలను ఇస్తూ ఉంటారు. స్కూల్ బస్సులు కూడా ఎక్కువ పసుపు రంగులో ఉండడానికి ఇదే కారణం. పసుపు రంగు కూడా త్వరగా గుర్తించబడుతుంది. అటువంటి స్కూల్ బస్సుల పక్కన వెళ్లే వారు నిదానంగా బస్సులోని పిల్లలు ఎలాంటి ఆక్సిడెంట్ల బారిన పడకుండా ఉండడానికి ఆ బస్సుకు అడ్డం రాకుండా తమ వాహనాలను నడుపుకుంటారు.
End of Article