Ads
చాలా మంది అమ్మాయిలు స్కార్ఫ్ ను ధరిస్తూ ఉంటారు. భద్రతా దృష్ట్యా కొందరు, పొల్యూషన్ ను దృష్టిలో ఉంచుకుని మరికొందరు స్కార్ఫ్ ని ధరిస్తూ ఉంటారు. అయితే.. కొందరు తమ సంప్రదాయాన్ని అనుసరించి కూడా ఈ స్కార్ఫ్ లను ధరిస్తూ ఉంటారు. అయితే.. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. కొన్ని తల నుంచి కాలి వరకు ఉంటాయి. మరి కొన్ని మెడ వరకు ఉంటాయి. వీటిలో మళ్ళీ మోడల్స్, షేప్స్ లలో తేడాలు కూడా ఉంటాయి. చాలామంది చూడగానే బురఖా వేసుకున్నారు అని చెప్పేస్తూ ఉంటారు.
Video Advertisement
ఇవి అన్ని ఎక్కువ నలుపు రంగులోనే ఉంటాయి కాబట్టి అన్ని ఒకటే అని అనుకుంటే పొరపాటే. ఈ బురఖాతో పాటు ఉండే ఇతర రకాల గురించి చాలా మందికి తెలియదు. వాటి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ లో మొత్తం ఏడు రకాల గురించి తెలుసుకుందాం.
#1. బురఖా:
బురఖా తల నుంచి పాదాల వరకు ఉంటుంది. ముఖంపై కూడా పూర్తిగా కప్పబడి ఉంటుంది. అయితే.. కళ్ళ వద్ద మాత్రం ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది బయటకి చూడడానికి వీలుగా ఉంటుంది.
#2. నిఖాబ్:
ఇది తలని మాత్రమే కప్పి ఉంచుతుంది. కళ్ళు ఉండే ప్లేస్ లో మాత్రం ఓపెన్ గా ఉంటుంది. ముఖాన్ని మాత్రం పూర్తిగా కప్పి ఉంచుతుంది.
#3. హిజబ్:
హిజబ్ అనేది తలతో పాటు మెడని కూడా కప్పి ఉంచుతుంది. ఇది చతురస్రాకారంలో ఉండే స్కార్ఫ్ లా ఉంటుంది. దీనిని తలను, మెడను కప్పుతూ చుట్టుకుంటారు. ముఖం మాత్రం ఓపెన్ గా కనిపిస్తూ ఉంటుంది.
#4. చాదర్:
ఇది కూడా చూడ్డానికి బురఖాలా ఉంటుంది. దేహమంతా కప్పేసి ఉంచుతుంది. కానీ ముఖం వద్ద మాత్రం ఓపెన్ గా ఉంటుంది. చూడడానికి, మాట్లాడడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
#5. షైలా:
షైలా అనేది పొడుగ్గా ఉండే స్కార్ఫ్ లా ఉంటుంది. దీనిని తల చుట్టూ చుట్టుకుంటారు. ముఖం మాత్రం మామూలుగానే ఉంటుంది.
#6. ఆల్-అమీరా:
ఇది కూడా తల భాగాన్ని, చెస్ట్ భాగాన్ని కప్పి ఉంచుతుంది. ముఖ భాగం ఓపెన్ గానే ఉంటుంది. అయితే ఇది చుట్టుకోవడానికి మాత్రం రెండు స్కార్ఫ్ భాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
#7. ఖిమర్:
ఇది చూడడానికి కేప్ లాగా ఒకే వస్త్రంతో రూపొందించబడి ఉంటుంది. ఇది తల భాగాన్ని, మెడను, భుజాలను కప్పి ఉంచుతుంది. ముఖ భాగం మాత్రం ఓపెన్ గానే ఉంటుంది.
End of Article