Home Off Beat సినిమా గ్రాఫిక్స్ షూటింగ్ చేసేటప్పుడు ఎందుకు గ్రీన్ మ్యాట్ ని వాడతారో మీకు తెలుసా..?

సినిమా గ్రాఫిక్స్ షూటింగ్ చేసేటప్పుడు ఎందుకు గ్రీన్ మ్యాట్ ని వాడతారో మీకు తెలుసా..?

by Sainath Gopi

ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలంటే ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి చిన్న దానిని కూడా చూసుకుంటూ మార్పులు చేసుకుంటూ సినిమాని తెరకెక్కిస్తూ వుంటారు. అందుకనే సినిమాని తెర మీదకి తీసుకు రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అయితే సినిమాలో నిజంగా గ్రాఫిక్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా గ్రాఫిక్స్ ఉంటాయి. దీని కోసం ఎక్కువ అమౌంట్ ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. నిజానికి గ్రాఫిక్స్ లేకపోతే సినిమాకి అంత లుక్ రాదు. చాలా సందర్భాలలో గ్రాఫిక్స్ ని ఉపయోగిస్తారు.

అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు గ్రాఫిక్స్ ని పెట్టడానికి గ్రీన్ మ్యాట్ ని ఉపయోగిస్తారు. అయితే ఎందుకు గ్రీన్ కలర్ మ్యాట్ ని ఉపయోగించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. చాలా మందికి ఈ ఆకు పచ్చ రంగు మ్యాట్ ని ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు. మరి ఎందుకు ఆకుపచ్చ రంగునే వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

Also Read:   సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అపర్ణ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

ఏదైనా గ్రాఫిక్స్ ని షూట్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ మ్యాట్ ని వెనక వేసేస్తారు. అయితే దీనిని ఉపయోగించడం వల్ల బ్యాగ్రౌండ్ స్క్రీన్ లో కనబడకుండా వుంటుంది. తర్వాత వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న మొత్తం కూడా తొలగిస్తారు. అందుకనే ఆకుపచ్చరంగు మ్యాట్ ని వెనకాల వాడతారు. దీంతో బ్యాక్ గ్రౌండ్ లో నచ్చిన ప్రదేశాలను పెడతారు.

గ్రీన్ కలర్ మ్యాట్ ని ఉపయోగించడం వల్ల నటీ నటుల శరీరానికి కానీ హెయిర్ కి కానీ లేదా ఇతర అవయవాలకు కానీ మ్యాచ్ అవ్వదు. అందుకనే ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క రంగును మాత్రమే తొలగిస్తారు. దీంతో మరి ఏమి కూడా డిలీట్ అవ్వకుండా ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆకుపచ్చ రంగు మ్యాట్ ని గ్రాఫిక్స్ ని షూట్ చేసేటప్పుడు ఉపయోగించడం జరుగుతుంది.

Also Read:  చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు రీజన్ అదేనట వైరల్ గా మారిన అతని కామెంట్స్

You may also like